Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగ్గురిని ప్రేమించాను కానీ... వారెవరూ నన్ను ప్రేమించలేదు : కరణ్ జోహార్

బాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్స్ జాబితాలో కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో పాటు.. ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఒకరు. 44 ఏళ్ల కరణ్‌.. తన కెరీర్‌గ్రాఫ్‌లో మంచి హిట్‌ అందుకొన్న రొమాంటిక్‌ సినిమాలు తీశాడు. కానీ

Webdunia
ఆదివారం, 4 డిశెంబరు 2016 (12:37 IST)
బాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్స్ జాబితాలో కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో పాటు.. ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఒకరు. 44 ఏళ్ల కరణ్‌.. తన కెరీర్‌గ్రాఫ్‌లో మంచి హిట్‌ అందుకొన్న రొమాంటిక్‌ సినిమాలు తీశాడు. కానీ తన జీవితంలో ప్రేమకి మాత్రం చోటులేకుండా పోయింది. ఈ విషయాలన్నీ కరణ్‌ ముంబైలో జరిగిన ఓ ఈవెంట్‌లో వెల్లడించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. నిజానికి నా జీవితంలో ఒకరు కాదు ఏకంగా ముగ్గురు అమ్మాయిలను ప్రేమించాను. కానీ వారిలో ఏ ఒక్కరూ కూడా నన్ను నన్నుగా ప్రేమించలేదు. దానికి కారణం నాకు తెలియదని చెప్పారు. 
 
అదేసమయంలో నా సినిమా లైఫ్‌ వంద శాతం విజయవంతమైంది. కానీ నా లవ్‌ లైఫ్‌ మాత్రం వంద శాతం ఫ్లాప్‌. నన్ను తిరిగి ప్రేమించనివారిని నేను ప్రేమించాను. అందుకే నేను జీవితంలో పెళ్లి గురించి ఆలోచించడంలేదేమో. జీవితంలో అన్నీ అనుభవించాను కానీ ప్రేమలో ఉన్న అనుభూతిని మాత్రం రుచిచూడలేకపోయాను అని నిర్వేదంతో చెప్పారు. 
 
అయితే, ప్రతి ఒక్కరూ నువ్వున్న స్థానంలో నిన్ను ఏ అమ్మాయి కాదనదు అంటుంటారు. ఏ స్థానం గురించి వారు మాట్లాడుతున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావడంలేదు. ఒకమ్మాయిని చూసి ఇష్టపడిన ప్రతీసారి నాకు చేదు అనుభవమే ఎదురైంది. నా 44 ఏళ్ల జీవితంలో ఒంటరితనమే ఎక్కువగా ఉంది' అంటూ తన సింగిల్‌ లైఫ్‌ గురించి వివరించారు కరణ్‌. కరణ్‌ ఆఖరిగా 'యే దిల్‌ హై ముష్కిల్‌' సినిమాని తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి హిట్‌గా నిలిచిన విషయం తెల్సిందే. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments