Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేప‌టినుంచి కాంతార సక్సెస్ టూర్, హీరో రిషబ్ శెట్టి

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2022 (17:14 IST)
kantara tour
సెప్టెంబర్ 30 న కన్నడలో రిలీజైన కాంతార చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ చిత్రం తెలుగులో అక్టోబర్ 15 న రిలీజై ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ చిత్రాన్ని తెలుగులో మెగా నిర్మాత అల్లు అరవింద్ "గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్" ద్వారా రిలీజ్ చేసారు. ఈ చిత్రం విజయవంతగా ఆడుతున్న తరుణంలో ప్రేక్షకులను నేరుగా కలిసేందుకు ఈ చిత్ర యూనిట్ సక్సెస్ టూర్ ను నిర్వహించనుంది. అక్టోబర్ 29న (శనివారం) తిరుపతి,వైజాగ్ లోని "కంతార" చిత్రం ప్రదర్శించబడుతున్న థియేటర్స్ ను సందర్శంచి,ప్రేక్షకులను కలవనున్నారు.ఈ సక్సెస్ టూర్ లో చిత్ర దర్శకుడు,హీరో అయినటువంటి రిషబ్ శెట్టి పాల్గొనున్నారు.
 
చిత్రంపై నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ... సినిమాకి లాంగ్వేజ్ బారియర్ లేదు సినిమాకి ఎమోషన్ బారియర్ ఒకటే ఉంటుంది అని కాంతార చిత్రం ప్రూవ్ చేసింది. ఇది మట్టిలోంచి పుట్టిన కథ ఇది ఎక్కడో కొరియన్, హాలీవుడ్ సినిమాలను నుంచి కాపీ కొట్టింది కాదు. ఈ సినిమాలో  విష్ణు తత్త్వం, రౌద్ర రూపం చూసాక ఇది సింహాచలం కి దగ్గరగా ఉన్న కథ అనిపించింది.  
 
ఈ సినిమాను కన్నడలో చూసి పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చి  అర్జెంటుగా మీరొక సినిమా చూడండి అంటూ బన్ని వాసు నాతో చెప్పాడు. ఏంటి బన్ని వాసు ఇంత ఎగ్జైట్మెంట్ చెబుతున్నాడు అనుకున్నాను.  సినిమా చూసినప్పుడు నాకు ఎమోషన్ అర్ధమైంది.ఈ ఎమోషన్ కి కనెక్ట్ అయ్యి దీనిని తెలుగులో డిస్ట్రిబ్యూషన్ చేస్తే బాగుంటుంది అనిపించి ఒక అవకాశంగా తీసుకుని దీనిని తెలుగులో రిలీజ్ చేసాం. అని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Future City: ఫ్యూచర్ సిటీ, అమరావతిని కలిపే హై-స్పీడ్ రైలు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారటగా!

Hyderabad: తెలంగాణలో భారీ వర్షాలు- టెక్కీలు వర్క్-ఫ్రమ్-హోమ్ అనుసరించండి..

Two Brides: ఇద్దరు మహిళలను ఒకేసారి పెళ్లి చేసుకున్న వ్యక్తి.. వైరల్ వివాహం..

ఫ్రిజ్‌లో పెట్టుకున్న మటన్ వేడి చేసి తిన్నారు, ఒకరు చనిపోయారు

పవన్ తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా? జనసేనాని ఏమన్నారు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments