Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"కాంతార" సినిమా చూస్తూనే థియేటర్‌లో తుదిశ్వాస విడిచిన ప్రేక్షకుడు

Advertiesment
kantara
, బుధవారం, 26 అక్టోబరు 2022 (10:24 IST)
కన్నడ హీరో రిషబ్ శెట్టి హీరోగా నటించి దర్శకత్వం వహించిన చిత్రం "కాంతార". ఈ చిత్రం కన్నడ, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సూపర్ డూపర్ హిట్ అయింది. నిర్మాతలకు, పంపిణీదారులకు కనకవర్షం కురిపిస్తుంది. గత నెలలో విడుదలైన ఈ చిత్రానికి ఇంకా ప్రేక్షకాదారణ తగ్గలేదు. 
 
ఈ నేపథ్యంలో కర్నాటకలో ఈ చిత్రాన్ని చూస్తూనే ఓ ప్రేక్షకుడు కన్నుమూశాడు. రాజశేఖర్ అనే 45 యేళ్ల ప్రేక్షకుడు సినిమా చూస్తూ కూర్చొన్న సీటులోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. ఈ విషయాన్ని గమనించిన ఇతర ప్రేక్షకులు థియేటర్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లగా, వారు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆ ప్రేక్షకుడు అప్పటికే చనిపోయాడని వైద్యులు వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మృగాళ్లను కఠినంగా శిక్షించాలి : చిరంజీవి డిమాండ్