Webdunia - Bharat's app for daily news and videos

Install App

రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ నిర్మిస్తున్న చిత్రం కాంత

Webdunia
శనివారం, 29 జులై 2023 (13:09 IST)
Kantha title poster
టాలీవుడ్ హీరో, రానా దగ్గుపాటి మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ ఓ చిత్రం కోసం జతకట్టారు. రానా స్పిరిట్ మీడియా, దుల్కర్ సల్మాన్ వేఫేరర్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ మల్టీ లింగ్వల్ చిత్రానికి సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించనున్నారు.
 
దుల్కర్ సల్మాన్ పుట్టినరోజున మేకర్స్ ఆసక్తికరమైన పోస్టర్‌తో సినిమా టైటిల్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి 'కాంత' అనే ఇంట్రస్టింగ్ టైటిల్ పెట్టారు. సహ నిర్మాతగా వ్యవహరించడంతో పాటు దుల్కర్ సల్మాన్ ఈ చిత్రంలో లీడ్ రోల్ పోషించనున్నారు.
 
ఈ సినిమాతో అసోసియేట్ అవ్వడానికి చాలా ఎక్సయిటెడ్ గా వున్న రానా ఇది ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని భరోసా ఇచ్చారు.
 
ఈ చిత్రం గురించి రానా మాట్లాడుతూ.. “చాలా అరుదుగా మంచి సినిమా పవర్ గుర్తు చేసే కథ మనకు కనిపిస్తుంది. కాంత మమ్మల్ని ఒకచోట చేర్చిన ప్రాజెక్ట్. సూపర్ ట్యాలెంటెడ్ దుల్కర్ సల్మాన్, వేఫేరర్ ఫిలిమ్స్ తో ఈ ప్రయాణాన్ని ప్రారంభించడం పట్ల మేము ఆనందిస్తున్నాము. అతని పుట్టినరోజు సందర్భంగా రాబోయే సరికొత్త ప్రపంచానికి సంబధించిన టైటిల్ రివిల్ చేశాం. పుట్టినరోజు శుభాకాంక్షలు దుల్కర్ సల్మాన్. కాంత ప్రపంచానికి స్వాగతం” అన్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, టీం వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

PV Sindhu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు, వెంకట సాయి.. (video)

Telangana: భర్తను చెల్లెలి సాయంతో హత్య చేసిన భార్య.. ఎందుకు ?

జనవరి 31 నుంచి అరకు ఉత్సవాలు.. మూడు రోజుల జరుగుతాయ్

తెలంగాణ భక్తులకు తిరుమలలో ప్రాధాన్యత ఇవ్వాలి: కొండా సురేఖ

కుమార్తె వచ్చాకే డాక్టర్ మన్మోహన్ అంత్యక్రియలు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

Herbal Tea హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

winter heart attack చలికాలంలో గుండెపోటుకి కారణాలు, అడ్డుకునే మార్గాలు

అరుదైన ఎక్స్‌ట్రాసోసియస్ ఆస్టియోసార్కోమాతో బాధపడుతున్న 18 ఏళ్ల బాలికకు ఏఓఐ విజయవంతంగా చికిత్స

Dry cough Home remedies పొడి దగ్గు తగ్గటానికి చిట్కాలు

తర్వాతి కథనం
Show comments