సాలార్ టీజర్ 100 మిలియన్స్, ఆగష్టు లో సినిమా షేక్ చేస్తుంది: ప్రశాంత్ నీల్
, శనివారం, 8 జులై 2023 (11:34 IST)
ప్రభాస్ హీరోగా నటిసున్న సాలార్ టీజర్ జులై 6న విడుదల అయి 100 మిలియన్స్ చేరుకుంది. దీనిపై నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ సంబరపడింది. ఈ సందర్భంగా ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ లెటర్ పోస్ట్ చేసింది. మీ అభిమానానికి రుణపడి ఉంటాము. త్యరలో ట్రైలర్ రాబోతుంది. భారతదేశం గర్వించే సినిమా సాలార్ అవుతుంది. మీ క్యాలెండరు లో ఆగష్టు నెల రాసిపెట్టుకోండి. తెలుగు సినిమా వైభవాన్ని తెలిపే సినిమా అవుతుంది అని పోస్ట్ చేశారు.
KGFతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ బ్యానర్ నిర్మిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రమిది. KGF2, కాంతార చిత్రాలతో ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్‌ను సొంతం చేసుకున్నాం. ఇప్పుడు మా బ్యానర్ నుంచి ప్రభాస్ హీరోగా మరో భారీ బడ్జెట్ సినిమా సలార్ రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందనటంలో సందేహం లేదని తెలిపారు.
తర్వాతి కథనం