Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్‌కు హార్ట్‌అటాక్!

Webdunia
శుక్రవారం, 29 అక్టోబరు 2021 (13:06 IST)
కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్‌కు గుండెపోటు వచ్చింది. ఆయన జిమ్‌లో కసరత్తులు చేస్తుండగా, గుండెపోటు రావడంతో హుటాహుటిన బెంగుళూరులోని విక్రమ్ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మరికొందరు అయితే ఆయన చనిపోయారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. 
 
ఇదిలావుంటే, కన్నడ లెజెండరీ యాక్టర్ రాజ్ కుమార్ తనయుడుగా శాండల్‌వుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పునీత్ రాజ్‌కుమార్ త‌న టాలెంట్‌తో ప‌వ‌ర్ స్టార్ అని పిలిపించుకుంటున్నారు. పునీత్ మంచి డ్యాన్స‌ర్ కూడా కావ‌డంతో ఆయ‌న‌కు విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఆయ‌న అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు.
 
పునీత్ రాజ్ కుమార్ జిమ్‏లో వ్యాయమం చేస్తున్న సమయంలో ఛాతీలో నొప్పిగా ఉందని తెలపడంతో ఆయన్ను బెంగుళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. పునీత్ రాజ్ కుమార్ ఆరోగ్యం మరింత విషమించడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆయనకు ఈసీజీ పరీక్షలు నిర్వహించారు. ఆయ‌న ఆరోగ్యంపై అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మార్నింగ్ వాక్ నుంచి మ్యారేజ్ వరకు.. 60 యేళ్ల వయసులో 51 యేళ్ల మహిళను పెళ్లాడిన దిలీప్ ఘోష్

lady don zikra అరేయ్ గూట్లే... నా బ్రదర్‌ను పొడిచినోడిని లేపేయ్?!: లేడీ డాన్ జిక్రా హస్తం?!!

ఏపీ నుంచి రాజ్యసభ స్థానానికి తమిళనాడు బీజేపీ నేత అన్నామలై?

ఈ రాత్రి నా భర్తను చంపేద్దాం.. ఆపై పామును వదిలేద్దాం.. పనైపోతుంది.. ప్రియుడితో..?

వైకాపాలో 2వ స్థానం నుంచి 2 వేల స్థానానికి చేర్చారు : విజయసాయి రెడ్డి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments