Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండంటి బిడ్డకు జన్మనిచ్చానంటూ వార్త... చూడగాని కృంగిపోయా : నేహా గౌడ్

Webdunia
బుధవారం, 24 జూన్ 2020 (19:48 IST)
తాను కాలిఫోర్నియాలో పండంటి బిడ్డకు జన్మనిచ్చానంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తను చూసి ఎంతో కుంగిపోయానని కన్నడ నటి నేహా గౌడ వాపోయింది. ఒకరి గురించి వార్త రాసేముందు.. ఆ వార్తకు సంబంధించి నిర్ధారణ చేసుకోవడం మంచిదన్నారు. 
 
బిగ్ బాస్ కన్నడ-3 ఫేమ్, కన్నడ నటి నేహ గౌడ అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చిందనే వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై ఆమె మండిపడ్డారు. తనపై ఇలాంటి అసత్యపు వార్తలు రావడం దురదృష్టకరమన్నారు. 
 
ఈ వార్తలతో తాను కృంగిపోయానని చెప్పుకొచ్చింది.ఇలాంటి వార్తలు రాసేవారు ఏం సాధిస్తారో తనకు అర్థం కావడం లేదని వాపోయింది. ఇలాంటి అసత్యపు వార్తలు రాసేవారు ఏదో ఒక రోజు మనోవేదనకు గురవుతారన్నారు. 
 
ఓ వార్త రాసేటప్పుడు ఎవరి గురించి రాస్తున్నారో వారిని ఒకసారి అడిగితే బాగుంటుందని నేహ గౌడ అన్నారు. తన గురించి వార్త రాసేటప్పుడు తననో, తన కుటుంబసభ్యులనో అడిగితే బాగుండేదని చెప్పారు. 
 
ఇలాంటి వార్తలు రాసేముందు మీకు కూడా ఓ అమ్మ, ఓ అక్క, ఓ స్నేహితురాలు ఉంటుందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని అన్నారు. కాగా, ఈమె అటు కన్నడంతో పాటు.. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments