Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుండెపోటు- 39 ఏళ్లలోనే కన్నడ నటుడు నితిన్ గోపీ మృతి

Webdunia
శనివారం, 3 జూన్ 2023 (14:34 IST)
Nithin Gopi
కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్ రాజ్‌కుమార్‌, తారకరత్న గుండెపోటుతో చిన్న వయస్సులోనే ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు మరో యువ నటుడు గుండెపోటుతో తుదిశ్వాస విడిచాడు. కన్నడ సినీ పరిశ్రమకు చెందిన నటుడు నితిన్‌ గోపీ గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. అతని వయసు 39 సంవత్సరాలు. 
 
ఛైల్డ్‌ ఆర్టిస్టుగా వెండితెరకు పరిచయమైన నితిన్‌ గోపీ దిగ్గజ నటుడు డాక్టర్‌ విష్ణు వర్ధన్‌తో కలిసి హలో డాడీ సినిమాలో పనిచేశాడు. ఈ సినిమా ఆయనకు మంచి గుర్తింపును సంపాదించిపెట్టింది. ఆ తర్వాత ముత్తినంత హెంతి, కేరళిద కేసరి, నిశ్శబ్ధ, చిరబండవ్య వంటి సినిమాల్లో నటించారు. కాగా.. శుక్రవారం రాత్రి వున్నట్టుండి గుండెపోటుతో కుప్పకూలాడు. 
 
కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందూతూ నితిన్‌ తుది శ్వాస విడిచారు. యువనటుడి మరణంతో శాండల్‌వుడ్‌ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. ఈ విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖులు, అభిమానులు నితిన్‌ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments