Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాలా కంఫర్టుగా ఉండే ప్రదేశం అదొక్కటే : కంగనా రనౌత్

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2020 (12:05 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత బయోపిక్‌లో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటిస్తున్నారు. కరోనా లాక్డౌన్ తర్వాత ఈ చిత్రం షూటింగ్ మళ్లీ ప్రారంభమైంది. ఈ చిత్రం షూటింగ్ కోసం ఆమె చెన్నైకు వచ్చి, షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఆదివారం జరిగిన షూటింగ్‌లో ఆమె పాల్గొంది. ఈ విషయాన్ని కంగనా తెలియజేస్తూ డైరెక్టర్‌ ఎ.ఎల్‌.విజయ్‌ తనకు సీన్‌ వివరిస్తున్న ఫొటోను షేర్‌ చేశారు. 
 
'టాలెంటెడ్‌ డైరెక్టర్‌ ఎ.ఎల్‌.విజయ్‌ నాకు సీన్‌ను వివరిస్తున్నారు. ఈ ప్రపంచంలో అద్భుతమైన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. కానీ చాలా కంఫర్ట్‌ అయిన ప్రదేశం ఏదైనా ఉందంటే అది ఫిలింసెట్‌ మాత్రమే' అని తన ట్విట్టర్ ఖాతాలో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. 
 
కాగా, బాలీవుడ్ హీరో సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ నెపోటిజం, డ్రగ్‌ మాఫియా తదితర అంశాలపై కంగనా రనౌత్‌ తనదైనశైలిలో స్పందించారు. దీంతో మహారాష్ట్రలోని అధికార శివసేన పార్టీ నేతలతో ఆమెకు వైరం ఏర్పడటంతో ముంబైను పాక్ ఆక్రమిత కాశ్మీర్‌తో ఆమె పోల్చారు. ఈ వ్యాఖ్యలను జీర్ణించుకోలేని శివసేన నేతలు కంగనా రనౌత్ సినీ కార్యాలయాన్ని కూల్చివేశారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాయచూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి పర్యావరణ ఆమోదం

మాజీ ప్రేమికుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలు లీక్.. పెళ్లి క్యాన్సిల్.. ఎలా జరిగిందంటే?

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments