Webdunia - Bharat's app for daily news and videos

Install App

హత్రాస్ అత్యాచార నిందితులను ఎన్‌కౌంటర్ చేయాలి : కంగనా

Webdunia
బుధవారం, 30 సెప్టెంబరు 2020 (20:03 IST)
హత్రాస్ అత్యాచార నిందితులను ఎన్‌కౌంటర్ చేసిపడేయాలని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కోరారు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు విజ్ఞప్తి చేశారు. హత్రాస్ అత్యాచార బాధితురాలి మృతి దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్ పట్టణానికి చెందిన 20 ఏళ్ల ఎస్సీ యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారం చేసి నాలుక కోసి హింసించారు. 
 
ఈ కామాంధులు లైంగిక దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయువతి ఢిల్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మరణించింది. ఆమె శరీరంలోని పలు ఎముకలు విరిగిపోయాయి. శరీరంలోని పలు అవయవాలు పని చేయని స్థితిలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా ఆగ్రహజ్వాలలను రగిల్చింది. దీనిపై పలువురు సెలబ్రిటీలు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తంచేశారు. 
 
తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కూడా స్పందించింది. హైదరాబాద్‌లో దిశ హంతకులకు విధించిన శిక్షనే వీరికీ విధించాలని ట్వీట్ చేసింది. 'యోగీ ఆదిత్యానాథ్ గారూ.. మీపై నాకు చాలా నమ్మకముంది. దిశ హంతకులకు ఎలాంటి శిక్ష పడిందో అలాంటి శిక్షనే వీళ్లకీ విధించాల'ని ట్వీట్ చేసింది. 
 
మరోవైపు, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు ఫోన్ చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని యోగిని ఆదేశించారు. వారిని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టొద్దని అన్నారు.
 
మోడీ ఫోన్ చేసిన విషయాన్ని యోగి వెల్లడించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని ఆదేశించారని చెప్పారు. దీనిపై ముగ్గురు అధికారులతో ఓ ప్యానెల్ ఏర్పాటు చేశామని... వారం రోజుల్లో ఈ ప్యానెల్ రిపోర్టు సమర్పిస్తుందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉగ్రవాదంపై ఉక్కుపాదం... షోపియాన్ జిల్లాలో ముగ్గురు ముష్కరుల హతం

భారత్ మాతాకీ జై నినాదాలతో మార్మోగిన ఆదంపూర్ వైమానిక స్థావరం

భారత్ మా సైనికులను చంపేసింది : మృతుల పేర్లను వెల్లడించిన పాకిస్థాన్

నదిలో శవమై కనిపించిన పద్మశ్రీ అవార్డు గ్రహీత!!

షోపియన్ అడవుల్లో ముగ్గురు లష్కర్ ఉగ్రవాదులు హతం, కొనసాగుతున్న గాలింపు చర్యలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం