బాలీవుడ్ నటి కంగరా రనౌత్ రోజూ ఏదోరకంగా వార్తల్లోకి ఎక్కుతుంటుంది. తన భావాలను ట్విట్టర్ ద్వారా తెలియజేస్తుంది. తాజాగా రిపబ్లిక్ డే నాడు రైతు నాయకుల ఉద్యమంపైనా స్పందించింది. రైతు పోరాటం వెనుక వున్నవారినందరినీ జైలులో పెట్టాలని ప్రభుత్వాన్ని కోరింది. ఇన్ని రోజుల పోరాటం చేస్తుంటే `దేశ్, సుప్రీంకోర్ట్ సబ్ కే మజాక్ బన్‌కే రహేగయా!` అంటూ ఆవేదనను వ్యక్తం చేసింది.
ఇక తాజాగా ఆమె `తలైవి` సినిమాలో జయలలిత పాత్రను పోషిస్తోంది. బయోపిక్‌లో నటించడం ఆనందంగా వుందని పేర్కొంది. అదేవిధంగా ఈసారి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రను పోషించనున్నట్లు వెల్లడింది. ఇది పొలిటికల్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కనున్న ఒక రాజకీయ నాటకంగా ఆమె పేర్కొంది. అయితే ఇంకా పేరు పెట్టని ఈ సినిమా గురించి పూర్తి వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉన్నప్పటికీ ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ ఫైనల్ దశలో వుంది. తలైవి పూర్తయ్యాక ఈ పాత్ర గురించి కసరత్తు చేయనున్నట్లు చెబుతుంది. కంగనా మాట్లాడుతూ, ఇది ఇందిరా గాంధీ యొక్క బయోపిక్ కాదు, ఇది ఒక గొప్ప కాలం చిత్రం, ఇది ఒక రాజకీయ నాటకం, ఇది నా తరానికి రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ప్రస్తుత భారతదేశం యొక్క రాజకీయ ప్రకృతి దృశ్యం అని పేర్కొంది.