Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ రంగంపై వివక్ష చూపుతున్న మహారాష్ట్ర సర్కారు : కంగనా ఫైర్

Webdunia
ఆదివారం, 19 సెప్టెంబరు 2021 (11:14 IST)
సినీ రంగంపై మహారాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో వివక్ష చూపుతోందని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఆరోపించారు. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గిందనీ, దీంతో పలు రాష్ట్రాలు సినియా థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చాయని, కానీ మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఉద్దేశ్యపూర్వకంగానే థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతి ఇవ్వలేదని కంగనా ఆరోపిస్తున్నారు. 
 
దేశంలో క‌రోనా తగ్గుముఖం పట్ట‌డంతో అనేక‌ రాష్ట్రాలు థియేటర్లను తెరుచుకునేందుకు అనుమతినిచ్చాయి. మహారాష్ట్ర ప్ర‌భుత్వం మాత్రం ఇందుకు అంగీక‌రించ‌పోవ‌డం సరికాద‌ని, సినీరంగంపై ఆ రాష్ట్ర స‌ర్కారు వివక్ష చూపుతోందని ఆమె ఆరోప‌ణ‌లు గుప్పించారు. 
 
ఇప్ప‌టికే చాలా సినిమాలు విడుదలకు సిద్ధ‌మ‌య్యాయ‌ని ఆమె అన్నారు. థియేటర్లు తెర‌వ‌డానికి ఒప్పుకోకుండా వాటిని పూర్తిగా మూసేయాలని ఆ రాష్ట్ర స‌ర్కారు భావిస్తోంద‌ని ఆరోపించారు.
 
మ‌హారాష్ట్ర పభుత్వం సినీ పరిశ్రమని వివక్షతో చూస్తున్నప్పటికీ దీనిపై ఎవరూ మాట్లాడ‌క‌పోవ‌డం శోచ‌నీయ‌మ‌ని చెప్పారు. కాగా, కంగ‌నా ర‌నౌత్ న‌టించిన‌ ‘తలైవి’ సినిమా విడుద‌ల నేప‌థ్యంలోనూ మ‌హారాష్ట్ర‌లో ప్ర‌భుత్వం థియేట‌ర్ల‌ను తెర‌వడానికి అనుమ‌తులు ఇవ్వ‌ని పరిస్థితి తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

covid 19 చైనాపై మరోసారి పంజా, 170 మంది మృతి, ప్రపంచం బెంబేలు

తెలుపు కాదు.. నలుపు కాదు.. బ్రౌన్ షర్టులో నారా లోకేష్.. పవన్‌ను అలా కలిశారు.. (video)

గోవాలో నూతన సంవత్సర వేడుకల కోసం వెళ్లిన యువకుడిని కర్రలతో కొట్టి చంపేసారు, ఎందుకు?

కుంభమేళా అంటే ఏమిటి? దేశంలో నాలుగు చోట్ల మాత్రమే ఎందుకు జరుగుతుంది

మున్సిపల్ యాక్ట్ రద్దు.. అమరావతిలో ఇంజనీరింగ్ కాలేజీలు.. ఏపీ కేబినెట్ నిర్ణయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అతి నిద్రతో అనారోగ్య సమస్యలు, ఏంటవి?

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments