Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీరాభిమానికి ప్రభాస్ వీడియో కాల్... ఉబ్బితబ్బిబ్బులైన శోభిత

Webdunia
ఆదివారం, 19 సెప్టెంబరు 2021 (10:15 IST)
కేన్సర్ మహమ్మారిబారినపడి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ వీరాభిమానికి హీరో ప్రభాస్ వీడియో కాల్ చేసి ఆశ్చర్యపరిచాడు. దీంతో ఆ అభిమాని ఆనందపరవశంలో మునిగిపోయింది. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, శోభిత అనే అమ్మాయి ప్రభాస్ వీరాభిమాని. ఈమె కేన్సర్ బారినపడి హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వస్తోంది. 
 
ఇటీవల ఆమె వైద్యులతో మాట్లాడుతూ, తాను ప్రభాస్ అభిమానినని, అతడితో మాట్లాడాలని ఉందని చెప్పింది. వైద్యుల ద్వారా విషయం తెలుసుకున్న ప్రభాస్ శనివారం వీడియో కాల్‌ చేసి శోభితతో సరదాగా ముచ్చటించాడు. 
 
అభిమాన హీరో నుంచి ఫోన్ రావడంతో ఉబ్బితబ్బిబ్బయిన శోభిత తన బాధను మర్చిపోయి ప్రభాస్‌తో ఆనందంగా మాట్లాడింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులకు ఫోన్ చేసి సర్‌ప్రైజ్ ఇవ్వడం ప్రభాస్‌కు కొత్తకాదు. గతంలో మిర్చి సినిమా షూటింగ్ సందర్భంగా భీమవరంలో మృత్యువుతో పోరాడుతున్న 20 ఏళ్ల అభిమానితోనూ ప్రభాస్ ఇలాగే ముచ్చటించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వాటర్ వరల్డ్‌లోపడిన ఆరేళ్ల బాలుడు... ఆస్పత్రికి తరలించేలోపు...

పోసాని కృష్ణ మురళిపై సూళ్లూరు పేట పోలీస్ స్టేషన్‌లో కొత్త కేసు

అలేఖ్య చిట్టి పచ్చళ్ల వ్యాపారం క్లోజ్ ... దెబ్బకు దిగివచ్చి సారీ చెప్పింది... (Video)

గుడికి వెళ్లిన అమ్మ.. అమ్మమ్మ... ఆరేళ్ల బాలికపై మేనమామ అఘాయిత్యం!!

కొత్త రికార్డు సాధించిన శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments