Webdunia - Bharat's app for daily news and videos

Install App

మణికర్ణిక పేరుతో సొంత బ్యానర్.. ప్రారంభించిన కంగనా రనౌత్

Webdunia
శనివారం, 1 మే 2021 (15:13 IST)
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, జాతీయ అవార్డు గ్రహీత కంగనా రనౌత్ చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టింది. అంతేకాదు సొంత నిర్మాణ సంస్థనూ ప్రారంభించింది. ఆమెకు విశేష ఖ్యాతిని తెచ్చిన 'మణికర్ణిక' చిత్రం పేరునే కంగనా తన బ్యానర్‌కు పెట్టడం విశేషం. 
 
అయితే తొలి యత్నంగా మెయిన్ స్ట్రీమ్ మూవీని కాకుండా డిజిటల్ ప్లాట్ ఫామ్ కోసం సినిమాను నిర్మిస్తోంది. నూతన నటీనటులతో క్యూట్ లవ్ స్టోరీగా 'టికు వెడ్స్ షేరు' పేరుతో సినిమా తీయబోతున్నట్టు కంగనా తెలిపింది. నిజానికి నటనతో పాటు కంగనా రనౌత్ కు చిత్ర నిర్మాణం, దర్శకత్వం మీద కూడా మక్కువ ఉంది. 
 
దానికి సంబంధించిన కోర్స్ కూడా చేసింది. అందుకే 'మణికర్ణిక' చిత్రం నిర్మాణ సమయంలో క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా దర్శకుడు క్రిష్ తప్పుకున్న తర్వాత కంగనా రనౌతే దానిని పూర్తి చేసి విడుదల చేసింది. 
 
ఇప్పుడు ఆమె భారీ, క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్న కారణంగా ఈ లవ్ స్టోరీకి దర్శకత్వం వహించే అవకాశం లేదు. కానీ భవిష్యత్తులో తన సొంత బ్యానర్ నుండి వచ్చే ఫీచర్ ఫిల్మ్స్ కోసం కంగనా మెగా ఫోన్ చేతిలోకి తీసుకునే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే... కంగనా రనౌత్ నటించిన జయలలిత బయోపిక్ 'తలైవి' విడుదలకు సిద్ధంగా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గూఢచర్య నెట్‌వర్క్‌పై ఉక్కుపాదం.. ఇప్పటికే 12 మంది అరెస్టు

భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 164 నమోదు

Selfi: ఎంత ధైర్యం.. ఆడ చిరుతలతో సెల్ఫీలు వీడియో తీసుకున్నాడా? (video)

బైటకు రావద్దు తలాహ్ సయీద్, నిన్నూ లేపేయొచ్చు: పాక్ ఆర్మీ, ఐఎస్ఐ వార్నింగ్

China: సింధు జలాల నిలిపివేత.. పాకిస్థాన్‌లో ఆ పనులను మొదలెట్టిన చైనా.. ఏంటది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments