Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఎమర్జెన్సీ' మూవీ ఎఫెక్ట్ : బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు హత్యా బెదిరింపులు!

ఠాగూర్
మంగళవారం, 27 ఆగస్టు 2024 (11:19 IST)
బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కు బెదిరింపులు వస్తున్నాయి. ఎమర్జెన్సీ చిత్రంలో ఆమె మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే మూవీ విడుదలకు ముందు సిక్కు తీవ్రవాద గ్రూపుల నుండి హత్య బెదిరింపులు వస్తున్నాయి. సినిమాను విడుదల చేస్తే సర్దార్‌లు మిమ్మల్ని చెప్పులతో కొడతారని గట్టిగా హెచ్చరించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియోను అప్‌లోడ్‌ చేశారు. ఇదే వీడియోను రీపోస్టు చేసిన కంగనా రనౌత్‌ పోలీసులను ట్యాగ్ చేసింది. 
 
ఇది గమనించాలంటూ కోరింది. ఆ వీడియోలో ఓ వ్యక్తి కంగనాను బెదరించాడు.. మీరు ఇప్పటికే చెంపదెబ్బ తిన్నారు. నేను గర్వించదగిన భారతీయుడిని. మహారాష్ట్రంలో ఎక్కడ మిమ్మల్ని చూసినా మేం.. మా హిందువులు, క్రైస్తవులు, ముస్లిం సోదరులతో కలిసి చెప్పులతో స్వాగతం పలుకుతామన్నాడు. మరో వ్యక్తి మాట్లాడుతూ, చరిత్రను మార్చలేం. సినిమాలో సిక్కులను తీవ్రవాదులుగా చిత్రకరించినట్లు అయితే.. బయోపిక్‌గా వచ్చిన వ్యక్తి ఏం జరిగిందో గుర్తంచుకోవాలి అంటూ చంపేస్తామంటూ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. 
 
కాగా, కంగనా రనౌత్‌ ఈ వీడియోపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. దయచేసి దీన్ని పరిశీలించండి అని ఆమె మైక్రో బ్లాగింగ్ సైట్‌లో కామెంట్స్ చేస్తూ, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ పోలీసులను ట్యాగ్ చేసింది. ప్రస్తుతం ఈ బెదిరింపులు సంచలనంగా మారాయి. అలాగే ఎమర్జెన్సీ చిత్రంలో కంగనా పాత్ర ఇపుడు ఆసక్తికరంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పిఠాపురానికి పవన్ కళ్యాణ్ చేసిన పనులేంటి?

రేషన్ బియ్యం మాయం కేసు : విచారణకు హాజరైన పేర్ని నాని భార్య!

రష్యా ఎంఐ-8 హెలికాఫ్టరును కూల్చివేసిన ఉక్రెయిన్ డ్రోన్ (Video)

ఓటరు కార్డు ఉండే ఓటు వేసే హక్కు ఉన్నట్టు కాదు : ఢిల్లీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్

భరత నాట్య కళాకారిణిని పెళ్లాడనున్న ఎంపీ తేజస్వీ సూర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments