Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మొబైల్ వినియోగదారులకు హెచ్చరిక చేసిన రిలయన్స్ జియో

jio reliance

ఠాగూర్

, సోమవారం, 26 ఆగస్టు 2024 (10:21 IST)
తమ మొబైల్ వినియోగదారులకు ప్రముఖ ప్రైవేట్ టెలికాం సంస్థ రిలయన్స్ జియో ఓ హెచ్చరిక చేసింది. జియో ప్రతినిధులమంటూ వ్యక్తిగత సమాచారాన్ని కోరుతున్న కొందరు కేటుగాళ్ళ వ్యవహారం తాజాగా వెలుగు చూసింది. ఈ విషయాన్ని స్వయంగా గుర్తించిన జియో కస్టమర్లను అప్రమత్తం చేసింది. జియో పేరిట ప్రజలను మోసగిస్తున్నారని, జియో ప్రతినిధులుగా నటిస్తూ సున్నిత సమాచారం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఈ తరహా మోసాలకు సంబంధించి నమోదైన కేసులు తమ దృష్టికి వచ్చాయంటూ కస్టమర్లను జియో అప్రమత్తం చేసింది. 
 
కాగా, జియో కస్టమర్లను కేటుగాళ్లు.. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ ఖాతా, క్రెడిట్ కార్డ్, ఓటీపీ, సిమ్ వంటి వివరాలు తెలుసుకునేందుకు వాట్సాప్ చాట్, ఫోన్ కాల్లు, మెసేజులు, ఈ-మెయిల్స్‌తో పాటు ఇతర మార్గాల్లో కస్టమర్లను సంప్రదిస్తున్నారు. జియో ప్రతినిధులుగా నమ్మించి వివరాలు అడుగుతున్నారని జియో పేర్కొంది. కోరిన వివరాలు అందించకపోతే సిమ్ కార్డ్ బ్లాక్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇక థర్డ్ పార్టీ యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవాలంటూ సూచిస్తున్నారని, తద్వారా మొబైల్, కంప్యూటర్‌లోని వ్యక్తిగత సమాచారాన్ని పొందుతున్నారని జియో అలర్ట్ చేసింది.
 
థర్డ్ పార్టీ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలని, ఈ-మెయిల్ ద్వారా వచ్చిన లింక్‌పై క్లిక్ చేయమని కస్టమర్లను కోరబోమని జియో పేర్కొంది. కాగా సిమ్‌పై ఉంటే 20 అంకెల సిమ్ నంబర్‌ను ఎవరికీ షేర్ చేయొద్దని కోరింది. యాప్‌లు, ఆన్‌లైన్ ఖాతాల పాస్‌వర్డులు, పిన్ నంబర్లను మార్చుతూ ఉండడం మంచిదని సూచించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కూల్చివేతలపై హైడ్రా నివేదిక - ఆక్రమణలపై భరతం పట్టాలంటూ సీఎం రేవంత్ ఆదేశం