Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజినీతో జట్టు కట్టేందుకు సిద్ధం : కమల్ హాసన్ ప్రకటన

ఇద్దరు రాజకీయ ఉద్ధండులు కరుణానిధి, జయలలితలు పూర్తిగా కనుమరుగైన నేపథ్యంలో తమిళనాడు రాజకీయాల సరళి పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా అన్నాడీఎంకే ప్రభుత్వంపై రోజురోజుకూ అవినీతి ఆరోపణలు పెరిగిపోతున్నాయి. అలాగ

Webdunia
శనివారం, 16 సెప్టెంబరు 2017 (12:29 IST)
ఇద్దరు రాజకీయ ఉద్ధండులు కరుణానిధి, జయలలితలు పూర్తిగా కనుమరుగైన నేపథ్యంలో తమిళనాడు రాజకీయాల సరళి పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా అన్నాడీఎంకే ప్రభుత్వంపై రోజురోజుకూ అవినీతి ఆరోపణలు పెరిగిపోతున్నాయి. అలాగే, మాటలతో దాడిచేసే వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. 
 
ఈ విషషయంలో తమిళ హీరో కమల్ హాసన్ మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇందులోభాగంగా, ఆయన త్వరలోనే రాజకీయా పార్టీని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. ఈ ప్రకటన తమిళనాడు రాజకీయాల్లో ఓ ప్రకంపనలు సృష్టించింది. 
 
ఈ నేపథ్యంలో, సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ ఒక‌వేళ రాజ‌కీయాల్లోకి వ‌స్తే ఆయ‌న‌తో క‌లిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు మ‌రో విశ్వనటుడు ప్రకటించారు. త‌న రాజ‌కీయ ప్ర‌వేశంపై ఊహాగానాలు వినిపిస్తున్న నేప‌థ్యంలో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. 
 
రాజ‌కీయాల్లో ర‌జ‌నీతో క‌లిసి ప‌నిచేస్తారా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు కమల్ సమాధానమిస్తూ... ఒక‌వేళ రాజ‌కీయాల్లో ర‌జ‌నీ వ‌స్తే, ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్న‌ట్లు ప్రకటించారు. త‌మిళ‌నాడులో జ‌ర‌గ‌నున్న మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో క‌మ‌ల్ పార్టీ రాజ‌కీయ ప్ర‌వేశం చేసే అవ‌కాశాలున్న‌ట్లు ఊహాగానాలు వ‌స్తున్నాయి.  
అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ రాష్ట్రానికి శుభవార్త చెప్పిన కేంద్రం.. ఏంటది?

ట్రాఫిక్ పోలీస్ కూతురిని ఎత్తుకుని ముద్దాడిన బాలయ్య (video)

ఏపీఎస్ఆర్టీ ఏసీ బస్సుల్లో 20 శాతం రాయితీ

వివాహేతర సంబంధం: పెళ్లయ్యాక మరొక వ్యక్తితో ఇష్టపూర్వక శృంగారం తప్పు కాదు కానీ...

కేరళ తిరూర్.. ఎలక్ట్రిక్ వాహనంలో మంటలు.. టూవీలర్‌పై జర్నీ చేసిన వారికి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments