కమల్ సీఎం కాలేడు.. రజనీకాంత్ రాజకీయాల్లోకి అస్సలు రారు: చారు హాసన్

జాతీయ ఉత్తమ నటుడు చారుహాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ నటుడు, లెజెండ్ కమల్ హాసన్ సీఎం అయ్యే అవకాశాలు ఎంతమాత్రమూ లేవని.. ఆయనకు అధికారం దక్కదన్నారు. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకే రారని జోస్య

Webdunia
సోమవారం, 9 అక్టోబరు 2017 (09:00 IST)
జాతీయ ఉత్తమ నటుడు చారుహాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ నటుడు, లెజెండ్ కమల్ హాసన్ సీఎం అయ్యే అవకాశాలు ఎంతమాత్రమూ లేవని.. ఆయనకు అధికారం దక్కదన్నారు. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకే రారని జోస్యం చెప్పారు. 
 
ఇక ప్రస్తుతం పలుకుబడి ఉన్న నేతల్లో సీఎం కాగల అవకాశం ఎవరికి ఉందన్న ప్రశ్నకు కేంద్ర మాజీ మంత్రి, పీఎంకే యూత్ వింగ్ ప్రెసిడెంట్ అన్భుమణి రాందాస్ పేరు చెప్పారు. వచ్చే నెల 7వ తేదీన కమల్ హాసన్ తన పార్టీ పేరు, జెండా, అజెండాలను ప్రకటిస్తారని వార్తలు వస్తున్న వేళ, సొంత సోదరుడికే నమ్మకం కలిగించలేకపోయారని విశ్లేషకులు అంటున్నారు. 
 
కాగా గత కొద్దిరోజులుగా కమల్ హాసన్ రాజకీయ అరంగేట్రంపై అనేక వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నవంబర్ 7వ తేదీన కమల్ హాసన్ బర్త్ డే కావడంతో కమల్ కీలక ప్రకటన చేయనున్నారు.

బిగ్ బాస్ సీజన్ 1 మొదలైనప్పటి నుంచి శభాష్ నాయుడు సినిమా షూటింగ్‌కి దూరమైన కమల్ త్వరలోనే మళ్లీ ఆ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నాడు. ఇదే కాకుండా మరో సినిమా చేయాల్సి వుంది. 
 
ఈ రెండు ప్రాజెక్ట్స్ పూర్తయ్యాకా ఇండియన్ 2 సినిమా మొదలవనుంది. సినిమా కమిట్‌మెంట్స్ అన్నీ పూర్తి చేసుకుని తర్వాతి ఎన్నికల నాటికి పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టికేంద్రీకరించాలని కమల్ హాసన్ నిర్ణయించినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పరకామణి చోరీ : ఫిర్యాదుదారుడు సతీష్ కుమార్‌ను గొడ్డలితో నరికి చంపేశారు

నౌగామ్ పోలీస్ స్టేషనులో భారీ పేలుడు... 9 మంది మృత్యువాత

స్కూటీ మీద స్కూలు పిల్లలు, గుద్దేశారు, వీళ్లకి డ్రైవింగ్ లైసెన్స్ వుందా? (video)

కవితతో మంచి సంబంధాలున్నాయ్.. కేటీఆర్ మారిపోయాడు.. నవీన్ కుమార్ యాదవ్

జాగ్రత్తగా ఉండండి: సురక్షిత డిజిటల్ లావాదేవీల కోసం తెలివైన పద్ధతులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments