రాజకీయాల్లోకి వస్తే తమిళనాడుకు మంచే చేస్తారు: లతా రజనీకాంత్
తమిళనాడు మాజీ సీఎం జయలలిత మృతికి తర్వాత రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించాయి. రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రకటించిన నేపథ్యంలో.. రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై ఆయన సతీమణి లతా రజనీకాంత్
తమిళనాడు మాజీ సీఎం జయలలిత మృతికి తర్వాత రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించాయి. రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రకటించిన నేపథ్యంలో.. రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై ఆయన సతీమణి లతా రజనీకాంత్ స్పందించారు.
ఓ ఎన్జీవో ఆర్గనైజేషన్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న లతా రజనీకాంత్… ఆయన రాజకీయాల్లోకి వస్తే తమిళనాడుకు మంచి చేస్తారన్నారు. అయితే రాజకీయ ప్రవేశం గురించి ఆయనే స్వయంగా ప్రకటిస్తారని లతా రజనీకాంత్ తెలిపారు. అతను ప్రజలకు మంచి చేయాలని వంద ఆలోచనలను కలిగి ఉండవచ్చునన్నారు.
మరోవైపు అమ్మ మృతి తర్వాత తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అధికార అన్నాడీఎంకేలో చీలకవచ్చి మళ్లీ కలిసిపోయింది. మరోవైపు శశికళ వర్గం అన్నాడీఎంకేలో చీలికకు ప్రయత్నించడం.. ఇక లోకనాయకుడు కమల్ హాసన్ వేగంగా రాజకీయాల వైపు అడుగులు వేస్తున్న సంగతి విదితమే.