Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒకే వేదికపై రజనీ - కమల్ : ఎడమొహం.. పెడమొహంగా...

తమిళ నటుడు స్వర్గీయ శివాజీ గణేషన్ మెమొరియల్‌ను చెన్నైలో ప్రారంభించారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజనీకాంత్, విలక్షణ నటుడు కమల్ హాసన్ హాజరయ్య

Advertiesment
ఒకే వేదికపై రజనీ - కమల్ : ఎడమొహం.. పెడమొహంగా...
, ఆదివారం, 1 అక్టోబరు 2017 (15:03 IST)
తమిళ నటుడు స్వర్గీయ శివాజీ గణేషన్ మెమొరియల్‌ను చెన్నైలో ప్రారంభించారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజనీకాంత్, విలక్షణ నటుడు కమల్ హాసన్ హాజరయ్యారు. ఇద్దరూ ఒకే వేదికపై ఆసీనులయ్యారు. శివాజీ గణేషన్ మెమొరియల్ భవనం, విగ్రహాలను ఆవిష్కరించారు. 
 
అయితే, ఒకే వేదికపై ఉన్న కమల్, రజనీ పలుకరించుకున్న తర్వాత ఎడమొహం, పెడమొహంగానే కనిపించారు. ఇద్దరూ బాలచంద్రుని శిష్యులుగానే ఇండస్ట్రీకి వచ్చినా.. వేర్వేరు భావజాలం కలిగిన వ్యక్తులు, రజనీ, కమల్ వేర్వేరు పార్టీలు పెట్టే ఆలోచనలో ఉన్నారు. తాను రాజకీయాల్లోకి వస్తున్నానని కమలహాసన్ స్పష్టమైన ప్రకటన చేసిన తరువాత, రజనీకాంత్ తో కలసి వేదికను పంచుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
దాదాపు రూ.3 కోట్ల వ్యయంతో 28,300 చదరపు అడుగుల విస్తీర్ణంలో శివాజీ స్మారక మందిరాన్ని నిర్మించడం జరిగింది. దీని ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాలని హీరో ప్రభు స్వయంగా వెళ్లి సీఎం పళనిస్వామిని ఆహ్వానించారు. అయితే, తాను రాలేనని చెప్పడంతో శివాజీ అభిమానులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
 
తన ముందస్తు కార్యక్రమాల షెడ్యూల్ కారణంగానే రాలేకపోతున్నానని వివరణ ఇచ్చుకున్న పళనిస్వామి, తన ప్రతినిధిగా పన్నీర్‌ను పంపుతున్నట్టు స్వయంగా ప్రభు ఇంటికి వెళ్లి మరీ చెప్పొచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హోటల్ గదిలో అనుష్కతో ప్రభాస్... నిజమా?