Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామాక్షి మూవీస్ అధినేత డి. శివప్రసాద్ రెడ్డి కన్నుమూత

Webdunia
శనివారం, 27 అక్టోబరు 2018 (14:39 IST)
ప్రముఖ సినీ నిర్మాత, కామాక్షి మూవీస్ అధినేత డి. శివప్రసాద్ రెడ్డి (62) శనివారం కన్నుమూశారు. హృదయ సంబంధిత సమస్యతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. హృదయ సంబంధిత సమస్యతో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్నారని.. అయినా చికిత్స ఫలించక శివప్రసాద్ రెడ్డి కన్నుమూసినట్లు వైద్యులు చెప్పారు. 
 
కాగా 1985లో కామాక్షి మూవీస్ బ్యానర్‌ను స్థాపించిన శివప్రసాద్ రెడ్డి అక్కినేని నాగార్జునకు పలు హిట్ సినిమాలు ఇచ్చారు. కార్తీక పౌర్ణమి, శ్రావణ సంధ్య, విక్కీ దాదా, ముఠామేస్త్రీ, అల్లరి అల్లుడు, ఆటోడ్రైవర్, సీతారామరాజు, ఎదురులేని మనిషి, నేనున్నాను, బాస్, కింగ్, రగడ, దడ, గ్రీకువీరుడు సినిమాలు నిర్మించారు. 
 
ఇకపోతే.. శివప్రసాద్ రెడ్డికి ఇద్దరు కుమారులు. ఆయన మృతితో తెలుగు సినీపరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. శివప్రసాద్ రెడ్డి మృతి టాలీవుడ్‌కి తీరని లోటు అని సినీ ప్రముఖులు అభిప్రాయపడ్డారు. ఆయన మృతిపట్ల పలువురు సంతాపం తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పబ్లిక్‌లో ఇదేమీ విడ్డూరంరా నాయనో (Video)

కత్తితో బెదిరించి విమానం హైజాక్‌కు దుండగుడు యత్నం... చివరకు ఏమైంది?

అమరావతిలో దేశంలోనే అతిపెద్ద ఎన్టీఆర్ విగ్రహం.. నరేంద్ర మోదీ పర్మిషన్ ఇస్తారా?

కుక్కల సతీశ్ ఇంట్లో ఈడీ సోదాలు... రూ.50 కోట్ల శునకం ఉత్తుత్తిదేనట

పవన్ కల్యాణ్ చిన్న కుమారిడిపై పరోక్షంగా కామెంట్లు చేసిన రోజా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments