Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా స్వభావం అలాంటిది.. నేను పార్టీలకు ఫంక్షన్లకు దూరంగా ఉంటా: కామక్షి భాస్కర్ల

Webdunia
శనివారం, 18 నవంబరు 2023 (08:40 IST)
"మా ఊరి పొలిమేర 2" చిత్రంలో లచ్చిమి పాత్రలో వెండితెరపై కనిపించిన హీరోయిన్ పేరు కామాక్షి భాస్కర్ల. గ్రామీణ నేపథ్యంలో సాగిన ఈ చిత్రంలో కామాక్షి గ్రామీణ యువతి పాత్రలో ఒదిగిపోయారు. ఆ సినిమా చూసిన ఎవరైనా సరే.. కామాక్షి నిజంగానే గ్రామీణ ప్రాంతానికి చెందిన ఆర్టిస్టే అని భావిస్తారు. అందువల్లే ఆ పాత్ర అంత సహజంగా కనిపించింది. 
 
ఈ సినిమాలో తన పాత్రపై ఆమె స్పందిస్తూ, తాను చైనాలో వైద్య విద్యా కోర్సును అభ్యసించినట్టు చెప్పారు. అపోలో ఆస్పత్రిలో డాక్టర్‌గా కొంతకాలం పని చేశాను. ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టాను. అటు నుంచి సినిమాలపై ఉన్న ఆసక్తికి మూవీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తాజాగా 'మా ఊరి పొలిమేర-2' చిత్రంలో నటించాను. 
 
"నేను ఎవరితోనూ పెద్దగా ఎక్కువగా మాట్లాడను. పార్టీలకు, పబ్‌లు, ఫంక్షన్లకు దూరంగా ఉంటాను. నాకు బాగా పరిచయమైన వారితో కాస్త చనువుగా ఉండగలుగుతాను. నలుగులోకి చొచ్చుకుపోయే స్వభావం నాది కాదు. అందువల్లనే ఇండస్ట్రీలో నేను ఇమడలేనని నా స్నేహితులు చెబుతుంటారు. కానీ, అలా ఉంటానే ఈ స్థాయికి చేరుకున్నాను" అని కామాక్షి భాస్కర్ల చెప్పుకొచ్చింది.

సంబంధిత వార్తలు

ఎమ్మెల్యే రాజాసింగ్‌ ముందస్తు అరెస్టు - విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు

దేవభూమి అనకనందా నదిలో పడిన మినీ బస్సు : 14 మంది మృతి

రుషికొండ ప్యాలెస్ రహస్యం గుట్టు రట్టు... రహస్యంగా విలాస భవనాలు కట్టారు: గంటా (Video)

ఆ రైల్వే డివిజన్ పరిధిలో నెల రోజుల పాటు అనేక రైళ్లు రద్దు!!

ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి మరో చేదు అనుభవం... ఫైలుపై సంతకం చేసేందుకు నిరాకరించిన మంత్రి!!

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments