క‌ళ్యాణ్‌రామ్ చిత్రం `ఏజంట్ వినోద్‌`?

Webdunia
సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (11:48 IST)
Kalyanram, Mytrimovies
నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ ఇటీవ‌లే సినిమాల‌కు గ్యాప్ తీసుకున్నాడు. ఆ గేప్‌లో బిగ్ బేన‌ర్‌తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు రాజేంద్ర అనే కొత్త ద‌ర్శ‌కుడిని ప‌రిచ‌యం చేస్తున్నాడు. ఈ చిత్ర క‌థ స్పై థ్రిల్లర్ గా రూపొందనుంది. క‌థ విన్న‌వెంట‌నే క‌ళ్యాణ్‌రామ్‌కు న‌చ్చి వెంట‌నే ఓకే చేశాడు.  క‌థ‌రీత్యా ఏజెంట్ వినోద్ అనే పేరు ప‌రిశీల‌న‌లో వున్న‌ట్లు స‌మాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌తో పాటు ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా మేకింగ్‌లో వీఎఫ్‌ఎక్స్‌ కీలకంగా మారనుందట.  అందుకే వాటిని పై శ్ర‌ద్ధ పెడుతున్నారు. 
 
మార్చి రెండోవారంలోపు ప‌నుల‌న్నీ ముగించుకు సెట్‌పైకి వెళ్ళ‌నున్నారు. సోమ‌వారంనాడు లాంఛ‌నంగా ఈ సినిమాను పూజ‌తో ప్రారంభించారు. మైత్రీ మూవీస్ అధినేత‌లు ఈ సినిమాకు నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.  1940 బ్యాక్‌డ్రాప్‌లో ఈ స్పై థ్రిల్లర్ గా రూపొంద‌నున్న‌ద‌ని స‌మాచారం. అతి కొద్ది సేప‌ట్ల‌లో మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌గ‌ల‌వ‌ని క‌ళ్యాణ్‌రామ్ ట్వీట్ చేశాడు. కాగా, కల్యాణ్‌రామ్‌ మల్లిడి వేణు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సినిమా చేస్తున్నాడు. అది ఏప్రిల్‌లో పూర్తికానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

9 డాలర్లు అంటే రూ.72 వేలా? ఇదేం లెక్క జగన్? ట్రోల్స్ స్టార్ట్

ప్రేమించిన వ్యక్తి మృతి చెందాడనీ మనస్తాపంతో ప్రియురాలు ఆత్మహత్య

Putin: ఢిల్లీలో ల్యాండ్ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్, స్వాగతం పలికిన ప్రధాని మోడి

Work From Village Policy: దేశంలోనే ఇది మొదటిసారి: బాబు, లోకేష్ సూపర్ ప్లాన్

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 18 మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments