Webdunia - Bharat's app for daily news and videos

Install App

బింబిసార మూవీ నుంచి రాయల్ లుక్‌లో కళ్యాణ్ రామ్

Webdunia
శనివారం, 28 మే 2022 (17:54 IST)
Bimbisara, Kalyan Ram
ప్రపంచంలోని తెలుగువారందరూ ఎన్‌.టి.ఆర్‌. శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మనవడు నందమూరి కళ్యాణ్ హీరోగా నటిస్తూ ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కె.హరికృష్ణ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న చిత్రం ‘బింబిసార’ చిత్రం నుంచి పోస్టర్ రిలీజ్ చేశారు.
 
‘బింబిసార’ పోస్టర్‌ను గమనిస్తే .. అందులో కళ్యాణ్ రామ్ రెండు వేరియేషన్స్‌లో కనిపిస్తున్నారు. అందులో ఒకటి క్రూరుడైన రాజు లుక్ కాగా.. మరో లుక్ స్టైలిష్‌గా ఉంది. ఈ రెండు లుక్స్‌లోనూ కళ్యాణ్ రామ్ రాయల్‌గా కనిపిస్తున్నారు. పోస్టర్‌లో ఎన్టీఆర్ శత జయంతి విషెష్ తెలియజేశారు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 5న గ్రాండ్ లెవల్లో రిలీజ్ చేస్తున్నారు.
 
కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన చిత్రాల్లోనటిస్తూ తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో త‌న‌దైన స్థానాన్ని సంపాదించుకున్న హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌ ఈ చిత్రంలో మగధ రాజు బింబిసారుడుగా కనిపించనున్నారు.  ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్’ ట్యాగ్ లైన్. వ‌శిష్ఠ్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన క‌ళ్యాణ్ రామ్ ఫ‌స్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌, టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచాయి.
 
చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేసుకుంటోంది. బింబిసార‌లో విజువ‌ల్ ఎఫెక్ట్స్‌, గ్రాఫిక్స్ కీల‌కంగా ఉండ‌బోతున్నాయి. భారీ సెట్స్‌తో క‌ళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న హై టెక్నిక‌ల్ వేల్యూస్ మూవీ ఇది. కళ్యాణ్ రామ్ సరసన కెథరిన్ ట్రెసా, సంయుక్తా మీనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
 
ఛోటా కె.నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రానికి చిరంత‌న్ భ‌ట్ మ్యూజిక్‌. ప్ర‌ముఖ సీనియ‌ర్‌ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి నేప‌థ్య సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి పాట‌లు:  సిరి వెన్నెల సీతారామ‌శాస్త్రి, రామ‌జోగ‌య్య శాస్త్రి, డాన్స్‌:  శోభి, ర‌ఘు, ఫైట్స్‌:  వెంక‌ట్‌, రామ‌కృష్ణ‌, వి.ఎఫ్‌.ఎక్స్‌:  అనిల్ ప‌డూరి, ఆర్ట్‌:  కిర‌ణ్ కుమార్ మ‌న్నె, ఎడిట‌ర్‌:  త‌మ్మిరాజు, మ్యూజిక్‌:  చిరంత‌న్ భ‌ట్‌, నేప‌థ్య సంగీతం:  ఎం.ఎం.కీర‌వాణి, సినిమాటోగ్ర‌ఫీ:  ఛోటా కె.నాయుడు, ప్రొడ్యూస‌ర్‌: హ‌రికృష్ణ.కె, ద‌ర్శ‌క‌త్వం: వ‌శిష్ఠ్‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ కేసు: జగన్‌ను అదానీ ఎప్పుడెప్పుడు కలిశారు.. అమెరికా అభియోగాల్లో ఏముంది?

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments