ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమాలో శర్వానంద్ హీరోగా నటిస్తున్నాడు. శర్వానంద్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, కల్యాణ్ ప్రియదర్శన్‌లు హీరోయిన్లుగా న
ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమాలో శర్వానంద్ హీరోగా నటిస్తున్నాడు. శర్వానంద్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, కల్యాణ్ ప్రియదర్శన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమా షూటింగ్ పారిస్‌లో జరుగుతోంది. కీలక సన్నివేశాలను ఈ ప్రాంతంలో చిత్రీకరిస్తున్నారు.
ఈ సినిమా తదుపరి షెడ్యూల్‌ను జూన్ ఐదో తేదీ నుంచి ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో కాజల్ అగర్వాల్ పాల్గొంటుందని టాక్. ఇప్పటికే కల్యాణి ప్రియదర్శన్ కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక కాజల్ అగర్వాల్ సీన్స్ త్వరలోనే తెరకెక్కనున్నాయి. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తోన్న ఈ సినిమాలో శర్వానంద్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నాడు. ఇది శర్వానంద్‌కు 25వ సినిమా కావడం గమనార్హం.