Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాడీ పోరాట కళా శిక్షణలో నిమగ్నమైన కాజల్ అగర్వాల్

Webdunia
బుధవారం, 19 డిశెంబరు 2018 (13:01 IST)
ఎస్.శంకర్ - కమల్ హాసన్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "భారతీయుడు". ఈ చిత్రం రెండో భాగంరానుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ ఓ హీరోయిన్. ఈ చిత్రం కోసం ఆమె నాడీ పోరాట కళా శిక్షణలో నిమగ్నమైంది. 
 
గతంలో నటి అనుష్క 'రుద్రమదేవి', 'బాహుబలి' చిత్రాల కోసం కత్తిసాము, గుర్రపుస్వారీ వంటి సన్నివేశాల్లో శిక్షణ తీసుకుని నటించింది. ఈ మధ్య నటి సమంత కూడా 'సీమరాజా' చిత్రం కోసం కర్రసాములో శిక్షణ తీసుకున్న విషయం తెల్సిందే. ఇక ఆ మధ్య నటి శ్రుతీహాసన్‌ 'సంఘమిత్ర' చిత్రం కోసం ఆస్ట్రేలియాలో కత్తిసాములో తర్ఫీదు పొందింది. అయితే అనివార్యకారణాల వల్ల ఆ చిత్రం ప్రారంభం కాలేదు. 
 
కాగా, ఇప్పుడు అందాలతార కాజల్‌ అగర్వాల్‌ సాహసాలు చేయడానికి సిద్ధం అవుతోంది. 'భారతీయుడు-2' చిత్రంలో నటించడానికి తనను తాను సిద్ధం చేసుకుంటోంది. ఈ అనూహ్య గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి తన వంతు ప్రయత్నానికి ప్రిపేర్‌ అవుతోంది. 22 ఏళ్ల క్రితం వచ్చిన 'భారతీయుడు' చిత్రంలో కమలహాసన్‌ టైటిల్‌ పాత్ర నాడీ పోరాట కళతో అవనీతి పరులను శిక్షించిన విషయం తెలిసిందే. 
 
ఇప్పుడు ఆ నాడీ పోరాట కళను శంకర్‌ నటి కాజల్‌అగర్వాల్‌తో ప్రదర్శింపనున్నారు. ఇందుకోసం కాజల్‌ నాడీ పోరాట కళలో శిక్షణ తీసుకుంటోందట. ఈ కళ తనకు నిజజీవితంలోనూ ఉపయోగపడుతుందని భావించి సీరియస్‌గానే నాడీ పోరాట కళను నేర్చుకుంటున్నట్లు కాజల్‌ వర్గం పేర్కొన్నారు. పనిలో పనిగా కలరి(మలయాళంలో ప్రాచుర్య విద్య) విద్యలోనూ శిక్షణ పొందుతోందట. 
 
మొత్తం మీద 'భారతీయుడు-2' చిత్రంలో కాజల్‌ను ఒక పోరాట నారీగా చూడవచ్చునన్న మాట. ఈ చిత్ర ప్రారంభం ఆలస్యం అవుతోంది. నిజానికి ఈ నెల 14నే 'భారతీయుడు-2' చిత్రాన్ని ప్రారంభించనున్నట్లు, నిర్మాణ సంస్థ లైకా అధినేతలు వెల్లడించారు. అయితే ఈ భారీ చిత్రం కోసం రూ.2 కోట్ల వ్యయంతో వేస్తున్న బ్రహ్మాడ సెట్‌ పూర్తి కాకపోవడంతో జనవరి నుంచి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశముంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Tirupati Stampede తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్లకై తొక్కిసలాట: నలుగురు భక్తులు మృతి

ఆ 3 గ్రామాల ప్రజలకు ఒక్క వారం రోజులలో బట్టతల వచ్చేస్తోంది, ఏమైంది?

TSPSC-గ్రూప్ 3 పరీక్ష- కీ పేపర్స్ విడుదల.. మే 1 నుంచి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు

ఖమ్మం పాఠశాలలో ఒకే ఉపాధ్యాయుడు- ఒకే ఒక విద్యార్థి

Modi: విశాఖపట్నంలో ప్రధాని గ్రాండ్ రోడ్ షో.. పూల వర్షం కురిపించిన ప్రజలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments