Webdunia - Bharat's app for daily news and videos

Install App

బడా హీరోలతో ఢీకొట్టనున్న చెర్రీ : సంక్రాంతి రేసులో ఆ మూడు చిత్రాలు

Webdunia
బుధవారం, 19 డిశెంబరు 2018 (12:48 IST)
వచ్చే సంక్రాంతికి మూడు పెద్ద చిత్రాలు ప్రేక్షకుల ముందుకురానున్నాయి. వీటిలో ఒకటి స్వర్గీయ ఎన్.టి.ఆర్. జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న 'ఎన్టీఆర్ బయోపిక్'. ఇందులో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్నారు. రెండో చిత్రం "ఎఫ్2" (ఫన్ అండ్ ఫస్ట్రేషన్). ఈ చిత్రంలో సీనియర్ హీరో వెంకటేష్, యువ హీరో వరుణ్ తేజ్‌లు నటిస్తున్నారు. మూడో చిత్రంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన "వినయ విధేయ రామ" చిత్రం. ఈ మూడు చిత్రాలు సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. 
 
'ఎన్టీఆర్ బయోపిక్‌'కు సంబంధించిన ఇప్పటికే విడుదలైన రెండు పాటలు అద్భుతంగా ఉన్నాయి. ఇవి ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం ప్రిరిలీజ్ వేడుక డిసెంబరు నెలాఖరులో జరుగనుంది. ఇకపోతే, "ఎఫ్2" ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది. 'వినయ విధేయ రామ' టీజర్‌ కూడా అద్భుతంగా ఉంది. ఈ చిత్రం ప్రిరిలీజ్ వేడుక త్వరలో జరుగనుండగా, దీనికి దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, హీరో జూనియర్ ఎన్టీఆర్‌లు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారనే వార్తలు వస్తున్నాయి. 
 
అయితే, గత సంక్రాంతికి బాలకృష్ణ, చిరంజీవిలు తలపడ్డారు. 'గౌతమీపుత్ర శాతకర్ణి' రూపంలో బాలకృష్ణ ప్రేక్షకుల ముందుకురాగా, 'ఖైదీ నంబర్ 150'గా చిరంజీవి సంక్రాంతి రేస్‌లో వచ్చారు. ఇపుడు బాలకృష్ణతో చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తలపడనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

విశాఖలో దారుణం : భర్తపై సలసలకాగే నీళ్లు పోసిన భార్య

హైదరాబాదుకు బూస్టునిచ్చే కొత్త గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు

ఐర్లాండ్‌లో భారతీయుడిపై జాత్యహంకార దాడి...

గుజరాత్ రాష్ట్రంలో స్వల్ప భూకంపం - రిక్టర్ స్కేలుపై 3.3గా నమోదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments