Webdunia - Bharat's app for daily news and videos

Install App

'చందమామపై మనసుపడిన ''మన్మథుడు"

Webdunia
గురువారం, 18 మార్చి 2021 (15:31 IST)
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్‌పై టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున మనసుపడ్డారు. నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కథానాయికగా కాజల్ పేరును ఖరారు చేశారు. 
 
ఈ విషయాన్ని గురువారం చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. తమ టీమ్‌లోకి కాజల్‌ని స్వాగతిస్తూ సోషల్ మీడియాలో మేకర్స్ ఓ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ గోవాలో జరుగుతోంది. త్వరలోనే కాజల్ ఈ సినిమా షూటింగులో జాయిన్ అవుతుంది.
 
ఇదిలావుంటే, సాధారణంగా పెళ్లయితే కనుక కథానాయికలకు చాలావరకు అవకాశాలు సన్నగిల్లిపోతాయి. కానీ, ఇటీవలి కాలంలో మాత్రం కొందరి విషయంలో ఇది తప్పని రుజువవుతోంది. పెళ్లయినా కూడా సమంత ఇప్పటికీ పలు సినిమాలలో నటిస్తూ బిజీగా వుంది. 
 
మరోపక్క, తాజాగా పెళ్లి చేసుకున్న కాజల్ అగర్వాల్‌కు కూడా అవకాశాలు వస్తూనే వున్నాయి. ఇప్పటికే చిరంజీవి సరసన 'ఆచార్య'లోను, హిందీలో 'ముంబై సాగా' సినిమాలోనూ నటిస్తున్న ఈ ముద్దుగుమ్మకు తాజాగా నాగార్జున సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకోవడం గమనార్హం. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రజలకు పనికొచ్చే వ్యాజ్యాలు వేయండి, పవన్ ఫోటోపై కాదు: హైకోర్టు చురకలు

Thar: టైర్ కింద నిమ్మకాయ పెట్టి యాక్సిలేటర్ అదిమింది.. కారు ఫస్ట్ ఫ్లోర్ నుంచి..? (video)

చంద్రబాబు బావిలో దూకి చావడం బెటర్: మాజీ సీఎం జగన్ తీవ్ర వ్యాఖ్యలు

Army: నేపాల్‌లో కొనసాగుతున్న అశాంతి.. అమలులో కర్ఫ్యూ- రంగంలోకి సైన్యం

నేపాల్‌లో చిక్కుకున్న 187మంది- రక్షణ చర్యల కోసం రంగలోకి దిగిన నారా లోకేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

తర్వాతి కథనం
Show comments