Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయిలు ఏ బ్రా వేసుకోవాలో వారికి తెలుసు : సంయుక్త దాడిపై కాజల్ కామెంట్స్

Webdunia
సోమవారం, 7 సెప్టెంబరు 2020 (14:21 IST)
కర్నాటక రాజధాని బెంగుళూరులో కన్నడ నటి సంయుక్తా హెగ్డేపై పబ్లిక్ పార్కులో ఓ మహిళదాడికి దిగడం, ఆమెకు మరికొంతమంది మద్దతు తెలపడం జరిగింది. అయితే, ఈ దాడి ఘటనను అనేక మంది సెలెబ్రిటీలు తీవ్రంగా ఖండించారు. అలాగే, ఇపుడు సినీ నటి కాజల్ అగర్వాల్ కూడా ఖండించారు. ఇదే అంశంపై ఆమె ఓ ట్వీట్ చేశారు. 
 
'సామ్! ఇలా జ‌రిగిందంటే నమ్మేలేక‌పోతున్నాను. క‌వితా రెడ్డి గారు మీ కోపానికి గ‌ల కార‌ణం ఏంటో తెలుసుకొని ప‌రిష్క‌రించుకోవాలి. మీ ఫ్ర‌స్ట్రేష‌న్‌, కోపం ఎక్క‌డి నుండి వ‌చ్చిందో తెలుసుకోవాలి. అన్నింటికి మించి అమ్మాయిలు ఏం వేసుకోవాలో వాళ్ళ‌కు తెలుసు. ఎదుటివారి గురించి పట్టించుకోవడం మాని మన పని మనం చూసుకుంటే మంచిది' అంటూ వ్యాఖ్యానించారు. 
 
కాగా, బెంగళూరులోని ఓ పార్క్‌లో స్పోర్ట్స్ బ్రా వేసుకుని త‌న స్నేహితురాలితో వర్కౌట్లు చేస్తోన్న సంయుక్త హెగ్డేపై కవితా రెడ్డి అనే మహిళ దాడి చేయగా, దీనికి సంబంధించిన ఒక వీడియో వైరల్ అయింది. ప‌బ్లిక్ ప్లేస్‌ల‌లో ఇలాంటి బ‌ట్టలు వేసుకొని తిరుగుతారా అంటూ క‌వితా రెడ్డి.. సంయుక్త‌తో పాటు ఆమె స్నేహితురాలిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ వ్య‌వ‌హారాన్నంతా రికార్డ్ చేసిన సంయుక్త త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ న్యాయం చేయాల‌ని కోరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో మహిళ హత్య

Pankaja Sri: వంశీకి హైపోక్సియా ఉంది.. జైలులో వుండలేరు.. భార్య పంకజ శ్రీ

అమర్నాథ్ యాత్ర కోసం 3 లక్షల 60 వేల మంది భక్తులు రిజిస్ట్రేషన్, యుద్ధమేఘాల మధ్య సాధ్యమేనా?

బీజేపీ నేత సుజనా చౌదరికి తీవ్ర గాయాలు... ఎలా?

ఒకే ఒక్క దెబ్బకి గోడకి కరుచుకున్నాడు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments