Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్పోర్ట్స్ బ్రా ధరించి పార్కుకొచ్చిన హీరోయిన్... ఇలాంటి బట్టలు ఎందుకు వేశావ్? అంటూ దాడి

Advertiesment
స్పోర్ట్స్ బ్రా ధరించి పార్కుకొచ్చిన హీరోయిన్... ఇలాంటి బట్టలు ఎందుకు వేశావ్? అంటూ దాడి
, శనివారం, 5 సెప్టెంబరు 2020 (14:13 IST)
కర్నాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులో ఓ హీరోయిన్‌పై దాడి జరిగింది. ఇప్పటికే శాండిల్‌వుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ కలకలం చెలరేగిన విషయం తెల్సిందే. ఈ కేసులో ఇప్పటికే సినీ నటి రాగిణి ద్వివేదిని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో తాజాగా మరో హీరోయిన్‌పై దాడి జరిగింది. 
 
కన్నడ చిత్రపరిశ్రమలో హీరోయిన్‌గా సంయుక్తా హెగ్డే రాణిస్తోంది. స్పోర్ట్స్ బ్రా వేసుకుని పార్కులో వ‌ర్క‌వుట్స్ చేయ‌డానికి తన స్నేహితులతో క‌లిసి హీరోయిన్ సంయుక్త హ‌గ్డే వచ్చింది. ఇదే పార్కులో జాగింగ్ చేస్తున్న కొంతమది మహిళలు ఆమెపై ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. 
 
ఇలాంటి బట్టలు ఎందుకు వేశావ్? అంటూ ఓ హీరోయిన్‌పై బహిరంగంగా ఓ మహిళ దాడి చేసింది. దాడి చేసిన మహిళకు స్థానికులంతా మద్దతు పలికారు. ఈ ఘటన బెంగ‌ళూరులోని ఓ పార్కులో చోటుచేసుకుంది. స్పోర్ట్స్ బ్రా వేసుకున్న హీరోయిన్‌ను చూడగానే ఆ మహిళ ఆగ్రహంతో ఊగిపోయి దాడి చేసింది. అక్కడే వున్న మరికొందరు మహిళలు ఆమెకు వత్తాసు పలుకుతూ, 'సరిగ్గా బుద్ధి చెప్పావు' అంటూ ప్రోత్సహించారు. 
 
అందరి మధ్య స్పోర్ట్స్ బ్రా వేసుకుని తిర‌గ‌డం తప్పని చెప్పారు. ఇటువంటి సెలబ్రిటీలందరూ డ్ర‌గ్స్  తీసుకుంటారంటూ సంయుక్తను దాడి చేసిన సదరు మహిళ తిట్టింది. అనంతరం పోలీసులకు ఫోన్‌ చేసిన హీరోయిన్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా జ‌రిగిన ఈ విష‌యాన్ని తెలుపుతూ ఆవేదన వ్యక్తం చేసింది. నిఖిల్ నటించిన 'కిరాక్ పార్టీ' సినిమాలో సంయుక్త ఓ కథానాయికగా నటించింది.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కన్నడ చిత్ర పరిశ్రమను ఊపేస్తున్న నటి రాగిణి ద్వివేది డ్రగ్స్ కేసు