Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆచార్య నుంచి కాజ‌ల్ అగ‌ర్వాల్ ఔట్ - పాటను క‌ట్ చేస్తారా?

Webdunia
సోమవారం, 25 ఏప్రియల్ 2022 (19:50 IST)
chiru-kajal
మెగాస్టార్ చిరంజీవి చిత్రం `ఆచార్య‌` సినిమాలో ఆయ‌న ప‌క్క‌న కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టించింది. క‌రోనాటైంలో సెట్‌కు వ‌చ్చిన‌ప్పుడు చిత్ర‌యూనిట్ కూడా బొకేల‌తో ఆహ్వానం ప‌లికారు. ఆ త‌ర్వాత నాలుగు రోజులు షూట్ చేశారు. కానీ కొన్ని కార‌ణాల‌వ‌ల్ల కాజ‌ల్‌ను తీసేసిన‌ట్లు ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఇటీవ‌లే కాజ‌ల్ మ‌గ‌పిల్లాడికి జ‌న్మ‌నిచ్చింది. 
 
అయితే సోష‌ల్ మీడియాలో కాజ‌ల్ గురించి వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ప్ర‌మోష‌న్‌లో ఎక్క‌డా ఆమె ఊసేలేదు. దీనిపై ఓ ఇంట‌ర్వ్యూలో ద‌ర్శ‌కుడు శివ మాట్లాడుతూ, క‌థ అనుకున్న‌ప్పుడు హీరోయిన్‌గా ఎవ‌ర‌నేది అనుకున్నాం,. ఫైన‌ల్‌గా కాజ‌ల్‌ను తీసుకున్నాం. కానీ నాలుగు రోజు షూట్ చేశాక‌. చిరంజీవిగారు న‌గ్జ‌ల్ బ్యాగ్‌డ్రాప్ పాత్ర కాబ‌ట్టి. ఆయ‌న‌కు పెయిర్ అనేది వుండ‌కూడ‌దు అనిపించింది. ఈ విష‌యం ఎలా చెప్పాల‌ని అనుకుంటూ రామ్‌చ‌ర‌ణ్‌కు చెప్పాను. అంద‌రికీ చెప్పి క‌థ ప్ర‌కారం ఇబ్బంది వుంటే తీసేయ‌మ‌ని చెప్పారు. ఆ త‌ర్వాత కాజ‌ల్‌కు విష‌యం చెప్పాం. ఆమెకూడా చాలా కూల్‌గానే స్పందించింది. అన్నారు. మ‌రి లాహే..లాహే.. పాట‌లో ఆమెను చూపించారుక‌దా? అని అడిగితే.. అది మీరు సినిమా చూసి తెలుసుకోండంటూ స‌మాధాన‌మిచ్చారు. 
 
కాజ‌ల్‌ను తీసుకున్న‌పుడే ఆమె అడిగిన భారీ రెమ్యున‌రేష‌న్‌కు అంగీకారంతో చిత్ర యూనిట్ తీసుకుంది. ఆ త‌ర్వాత క‌రోనా కాలంలో కొద్దిరోజులు గేప్‌తో జ‌రిగింది. మ‌ర‌లా షూటింగ్‌కు గేప్ వ‌చ్చింది. ఈ ద‌శ‌లో ఆమెను తీసేస్తున్న‌ట్లు కూడా అప్ప‌ట్లోనే వార్త‌లు వ‌చ్చాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: భూ వివాదం ఒక ప్రాణాన్ని బలిగొంది.. నలుగురు కుమారుల మధ్య..?

భర్త తప్పిపోయాడని క్షుద్ర వైద్యుడి దగ్గరికి వెళ్తే.. అసభ్యంగా ప్రవర్తించాడు.. ఏం చేశాడంటే?

కర్నూలులో వరుస హత్యలు.. భయాందోళనలో ప్రజలు

Heavy rainfall: బంగాళాఖాతంలో అల్పపీడనం- తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్

Kavitha: కవితకు బిగ్ షాకిచ్చిన కేటీఆర్‌.. పార్టీ నుంచి సస్పెండ్.. హరీష్ ఆరడుగుల బుల్లెట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments