Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాజల్ అగర్వాల్ చెల్లి పాత్ర వేసేస్తుంది... ఇక హీరోయిన్‌గా అంతేనా?

Webdunia
శుక్రవారం, 16 ఆగస్టు 2019 (21:36 IST)
టాప్ హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ కూడా ఒకరు. ఐతే ఈమధ్య ఆమె నటించిన సీత చిత్రం బాక్సాఫీస్ వద్ద బోర్లా పడింది. ఎంతో ఎక్స్ పెక్ట్ చేసి తీసిన చిత్రం కాస్తా దెబ్బ తినడంతో అందులో నటించిన కాజల్ అగర్వాల్ కి హీరోయిన్ ఆఫర్లు ఇచ్చేందుకు దర్శకనిర్మాతలు వెనుకంజ వేస్తున్నట్లు టాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. 
 
మరి ఇది నిజమో ఏమోగానీ కాజల్ అగర్వాల్ తన ఫ్యాన్సుకి షాకిస్తూ ఓ నిర్ణయం తీసుకుంది. అదేంటయా అంటే ఆమె చెల్లెలు పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం. మంచు విష్ణు సోదరి పాత్రలో ఆమె నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అంతేకాదు... షూటింగ్ స్పాట్ నుంచి హ్యాపీ రాఖీ అర్జున్ అంటూ ట్వీట్ చేసింది.
 
ఈ పోస్టుతో పాటు ఫోటోను కూడా చేర్చింది. కాగా మంచు విష్ణు నటిస్తున్న ఈ చిత్రంలో అతడి చెల్లెలిగా నటించే పాత్రకు ప్రాముఖ్యత వుంటుందట. ఈ చిత్రంలో పాత్ర డిమాండ్ మేరకు నటించేందుకు అంగీకరించినట్లు కాజల్ అగర్వాల్ చెపుతోందట. ఏదేమైనప్పటికీ హీరోయిన్ గా గ్లామర్ అందాలను ఒలకబోసే తార గబుక్కున చెల్లి పాత్రలు చేసేందుకు ఓకే అంటే ఫ్యాన్స్ కాస్త ఫీలవడం మామూలే కదా. చూద్దాం.. కాజల్ అగర్వాల్ చెల్లెలి పాత్రతో ఎంతమేర క్రేజ్ సంపాదించుకుంటుందో?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ లిక్కర్ కేసు: సిట్ విచారణకు హాజరైన వైసీపీ నేత మిథున్ రెడ్డి

తండ్రి మృతదేహం ముందే ప్రియురాలి మెడలో తాళి కట్టిన కుమారుడు (వీడియో)

కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకేసిన విద్యార్థిని.. కారణం ఏంటి? (Video)

కాల్పుల ఘటన: కెనడాకు వెళ్లిన భారతీయ విద్యార్థిని మృతి

వందలాది మంది అంతర్జాతీయ విద్యార్థుల విద్యా వీసాలు రద్దు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

తర్వాతి కథనం
Show comments