Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.25 కోట్ల బడ్జెట్‌తో విజయ్‌ ఆంటోని "జ్వాల"

Webdunia
సోమవారం, 23 నవంబరు 2020 (18:44 IST)
‘బిచ్చగాడు’ చిత్రంతో తెలుగులో ఫ్యాన్స్‌ను సంపాదించుకున్న తమిళ నటుడు విజయ్‌ ఆంటోని. తెలుగులో ‘జ్వాల’గా, తమిళ్‌లో ‘అగ్ని శిరగుగళ్‌’ ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్‌ సరసన అక్షర హాసన్‌ నటిస్తుండగా ‘సాహో’ ఫేమ్‌ అరుణ్‌ విజయ్‌ కీలకపాత్ర చేస్తున్నారు. ద్విభాషా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రానికి నవీన్‌.ఎం దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో శర్వంత్‌రామ్‌ క్రియేషన్స్‌ పతాకంపై  జవ్వాజి రామాంజనేయులు, షిరిడిసాయి క్రియేషన్స్‌ పతాకంపై ఎం‌.రాజశేఖర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. 
 
ఉజ్బెకిస్తాన్, కజికిస్తాన్‌ దేశాలతో పాటు యూరప్‌లోని పలు దేశాల్లో చిత్రీకరణ జరుపుకున్న భారీబడ్జెట్‌ చిత్రమిది అన్నారు. నిర్మాతల్లో ఒకరైన ఎం‌.రాజశేఖర్‌ రెడ్డి. ఈ చిత్రం ఆఖరి షెడ్యూల్‌ కో‌ల్‌కత్తాలో జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్‌తో సినిమా పూర్తవుతుంది. విజయ్‌ ఆంటోని కెరీర్‌లోనే దాదాపు రూ.25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న తొలిచిత్రమిది. రీమాసేన్‌ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం నటరాజన్‌ సమకూర్చుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వివేకానంద రెడ్డి హత్య కేసు- హంతకుడిని గుర్తించకుండానే దర్యాప్తు పూర్తయ్యిందా?

నెల్లూరులోని దగదర్తి విమానాశ్రయం పనులు- రూ.916 కోట్లు ఆమోదం

సిద్ధం సిద్ధం.. అని అప్పుడు అరిచారు.. ఇప్పుడు రప్పా రప్పా అంటే ఊరుకుంటామా?

Super Six: వైకాపా పాలనను ధృతరాష్ట్ర కౌగిలిగా అభివర్ణించిన ఏపీ సీఎం చంద్రబాబు

హైదరాబాదులో రూ.13.9 కోట్ల విలువైన 13.9 కిలోల హైడ్రోపోనిక్ పట్టివేత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

తర్వాతి కథనం
Show comments