సడెన్‌గా సోనాల్ చౌహాన్‌కు కాల్ చేశా, అందుకు టక్కున ఒప్పేసుకుంది: బాలక్రిష్ణ

Webdunia
బుధవారం, 18 డిశెంబరు 2019 (17:34 IST)
బాలక్రిష్ణ యువకుడిగా నటించిన చిత్రం రూలర్. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనానే ఉంది. అయితే బాలక్రిష్ణ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నాపై ఎంతోమంది హీరోయిన్లు ఇప్పటికీ నమ్మకం పెట్టుకుని ఉన్నారు. నేను ఫోన్ చేస్తే చాలు ఒక్కసారితోనే ఒప్పేసుకుంటారు.
 
అందులో మొదటి హీరోయిన్ నయనతార. శ్రీరామరాజ్యం సినిమాకు నేను ఆమెకు ఫోన్ చేశా. మనం ఒక సినిమా చేస్తున్నాం. అందులో మీది సీత క్యారెక్టర్ అన్నాను. టక్కున సరే సర్ అని చెప్పింది. ఆ తరువాత రూలర్ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు కావాలన్నారు. ఒక హీరోయిన్ వేదికను అప్పటికే సెలక్ట్ చేసేశారు.
 
ఇక రెండో హీరోయిన్ ఎవరా అని దర్సకుడు కె.ఎస్.రవికుమార్, నిర్మాత కళ్యాణ్ ఆలోచనలో పడ్డారు. నేను ఒక్క క్షణం ఆగండి అంటూ ఫోన్ తీసుకున్నా. సోనాల్ చౌహాన్‌కు ఫోన్ చేశా. ఒక సినిమా ఉంది. మనం కలిసి చేయాలని చెప్పా. వెంటే సోనాల్ ఒకేనంది. డైరెక్టర్, నిర్మాతలకు చెప్పి సోనాల్‌కు ఒకే చేసేశా. నాపై ఇప్పటికీ ఎంతోమంది హీరోయిన్లకు నమ్మకం ఉంది. ఆ నమ్మకం నాకు చాలంటూ సంతోషంతో చెబుతున్నారు బాలయ్య బాబు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జూబ్లీ హిల్స్ బైపోల్.. హస్తం హవా.. కారుకు బ్రేక్

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాలు.. కేసీఆర్ ఏమన్నారంటే?

25 ఏళ్ల జానపద గాయని మైథిలీ ఠాకూర్ చేతిలో ఓడిపోతున్న ఉద్ధండ నాయకుడు బినోద్ మిశ్రా

పరకామణి చోరీ కేసు : ఫిర్యాదు చేసిన ఏవీఎస్వో అనుమానాస్పద మృతి

గ్యాంగ్ రేప్ చేసి బయటే తిరుగుతున్నాడు.. యువతి ఆవేదన (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

తర్వాతి కథనం
Show comments