Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదోసారి కలిసి నటించనున్న సమంత, చైతన్య.. హిట్ ఖాయమా?

Webdunia
బుధవారం, 18 డిశెంబరు 2019 (15:52 IST)
టాలీవుడ్ స్టార్ జంట నాగచైతన్య, సమంత ఐదోసారి జంటగా నటించనున్నారు. ఇప్పటికే మజిలీ సినిమాతో వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో మంచి కలెక్షన్ల మోత మోగించిన ఈ జంట మళ్లీ కలిసి నటించేందుకు సై అంటున్నారు. 
 
పరుశురామ్ దర్శకత్వంలో రూపొందబోతున్న ఓ మూవీ. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ సినిమా షూటింగ్‌లో త్వరలో జాయిన్ అవ్వబోతున్నాడు హీరో నాగచైతన్య. ఈ సినిమాలో హీరోయిన్‌గా సామ్ నటిస్తోంది. ప్రస్తుతం వెంకటేశ్, నాగచైతన్య కథానాయకులుగా నటించిన 'వెంకీ మామ' వసూళ్ళలో దూసుకుపోతోందన్న సంగతి తెలిసిందే. 
 
నాగ చైతన్య, సమంత ఇప్పటి వరకు కలిసి నాలుగు సినిమాలు చేశారు. ఇందులో మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అయితే పెళ్లి తరువాత కలిసి నటించిన సినిమా మజిలీ. వాస్తవానికి మజిలీ సినిమాతో మరుపురాని విజయాన్ని అందుకున్నారు నాగ చైతన్య, సమంత.
 
 పెళ్లి తర్వాత ఎలాంటి ఎమోషనల్ సినిమాలో అయితే నటించాలి అనుకున్నారో.. అచ్చంగా అలాంటి కథనే తీసుకొచ్చాడు శివ నిర్వాణ. ఈ చిత్రం సంచలన విజయం సాధించడంతో ఇప్పుడు ఈ జంటతో సినిమాలు నిర్మించడానికి నిర్మాతలు పోటీ పడుతున్నారు. 
 
ఇక ప్రస్తుతం నాగ చైతన్య శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ సినిమాతో పాటే నాగ చైతన్య పరశురామ్ దర్శకత్వంలో ఒక డిఫరెంట్ స్టోరీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మించే ఈ చిత్రంలో మరోసారి చైతన్య సరసన సమంత మరోసారి జోడి కట్టనుందనే ఫిల్మ్ నగర్ టాక్ వినిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Surrogacy racket: సరోగసీ స్కామ్‌ డాక్టర్ నమ్రతపై ఎన్నెన్నో కేసులు.. విచారణ ప్రారంభం

Crocodile: వామ్మో.. మూసీ నదిలో మొసళ్ళు- భయాందోళనలో ప్రజలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

విశాఖలో దారుణం : భర్తపై సలసలకాగే నీళ్లు పోసిన భార్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments