Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూనియర్ ఆర్టిస్ట్ శ్రీశాంత్‌ రెడ్డిపై చెప్పులతో దాడి.. శ్రీరెడ్డితో కలిసి వెళ్లి...

జూనియర్ ఆర్టిస్ట్ శ్రీశాంత్ రెడ్డిపై పలువురు మహిళలు చెప్పులతో కొట్టారు. క్యాస్టింగ్ కౌచ్‌పై ఒంటరిపోరాటం చేస్తున్న నటి శ్రీరెడ్డితో కలిసి వెళ్లిన ఈ మహిళలంతా కలిసి శ్రీశాంత్ రెడ్డిని కొట్టారు. అదీ కూడా

Webdunia
శుక్రవారం, 11 మే 2018 (10:29 IST)
జూనియర్ ఆర్టిస్ట్ శ్రీశాంత్ రెడ్డిపై పలువురు మహిళలు చెప్పులతో కొట్టారు. క్యాస్టింగ్ కౌచ్‌పై ఒంటరిపోరాటం చేస్తున్న నటి శ్రీరెడ్డితో కలిసి వెళ్లిన ఈ మహిళలంతా కలిసి శ్రీశాంత్ రెడ్డిని కొట్టారు. అదీ కూడా బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లోనే కావడం గమనార్హం.
 
పోలీసుల కథనం ప్రకారం... ఇందిరానగర్‌కు చెందిన శ్రీశాంత్‌రెడ్డి సినీ కో-ఆర్డినేటర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి ఓ జూనియర్‌ ఆర్టిస్ట్‌తో పరిచయమైంది. ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. తనను బోరబండకు తీసుకెళ్లిన శ్రీశాంత్‌రెడ్డి కూల్‌డ్రింక్‌లో డ్రగ్స్‌ కలిపి ఇచ్చి పలుమార్లు అత్యాచారం చేయడంతోపాటు డబ్బు లాక్కొని పారిపోయాడని బాధితురాలు ఆరోపిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. 
 
దీనిపై బంజారాహిల్స్‌ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేయనున్నట్టు వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్ట్‌ చేసింది. ఈ విషయం తెలుసుకున్న అతడు స్టేషన్‌కు వెళ్లాడు. జూనియర్‌ ఆర్టిస్ట్‌ తన పరువు తీసేలా సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తోందంటూ ఎస్‌ఐ వద్ద కూర్చొని ఫిర్యాదు రాస్తున్నాడు. ఇంతలో జూనియర్‌ ఆర్టిస్ట్‌, సినీనటి శ్రీరెడ్డి మరికొంతమంది మహిళలతో కలిసి స్టేషన్‌కు వచ్చారు. 
 
తనపై సినీ కో-ఆర్డినేటర్‌ లైంగిక దాడి చేశాడని ఫిర్యాదు చేసేందుకు వచ్చినట్టు పోలీసులకు తెలిపింది. పోలీసులు వివరాలు అడుగుతుండగానే మహిళలు శ్రీశాంత్‌రెడ్డిని చూశారు. అందరూ కలిసి మూకుమ్మడిగా అతడిపై దాడి చేశారు. జూనియర్‌ ఆర్టిస్ట్‌తోపాటు మిగతా వారు కూడా కొట్టారు. ఓ మహిళ ఎస్‌ఐ టేబుల్‌ పైకెక్కి చెప్పుతో దాడి చేసింది. పోలీసులు వారిని ఆపేందుకు ప్రయత్నించారు. శ్రీశాంత్‌రెడ్డికి రక్షణగా నిలిచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం