డేటింగ్‌కు రాలేదనీ... ఆమె ప్రియుడిని హత్య చేసిన ఎన్.ఆర్.ఐ
తనతో డేటింగ్ చేసేందుకు నిరాకరించిన ఓ యువతి బాయ్‌ఫ్రెండ్‌ను ప్రవాస భారతీయుడు హత్య చేశాడు. ఈ దారుణం అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, కెవిన్ ప్రసాద్ (31) అనే ప్రవాస భారతీ
తనతో డేటింగ్ చేసేందుకు నిరాకరించిన ఓ యువతి బాయ్‌ఫ్రెండ్‌ను ప్రవాస భారతీయుడు హత్య చేశాడు. ఈ దారుణం అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, కెవిన్ ప్రసాద్ (31) అనే ప్రవాస భారతీయుడు శాన్‌ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయంలో సెక్యూరిటీ సేవలందిస్తున్నాడు. అదేచోట ఓ యువతి పనిచేస్తోంది. ఈమెను ఎలాగైనా వశం చేసుకోవాలన్న ఉద్దేశంతో ప్రసాద్ పలుమార్లు ఆమెను డేటింగ్‌కు రమ్మని ఆహ్వానించాడు. నగలు, నగదు ఆశచూపి లోబరుచుకోవాలని ప్లాన్ వేశాడు.
అయితే, దాన్ని తిరస్కరించిన ఆమె, తనకు దీర్ఘకాలంగా మార్క్ మంగాక్కట్ (31) అనే బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని, తమకు మూడేళ్ల బిడ్డ కూడా ఉందని చెప్పి తప్పించుకునేది. ఈ క్రమంలో తలకు ముసుగు ధరించిన ఓ యువకుడు మంగాక్కట్ కారు వద్దకు వచ్చి అతన్ని తుపాకితో కాల్చి చంపాడు. విచారణ ప్రారంభించిన పోలీసులకు తొలుత నిందితుడిని గురించి ఒక్క క్లూ కూడా లభించలేదు.
ఇదేసమయంలో అతని గర్ల్‌ఫ్రెండ్ అయిన ప్రసాద్ సహోద్యోగినిని విచారిస్తున్న క్రమంలో, పనిచేసేచోట ఓ యువకుడు తనను డేటింగ్‌కు రావాలని ఒత్తిడి చేస్తుండేవాడని ఆమె చెప్పగా, పోలీసులు ఆ దిశగా విచారణ ప్రారంభించారు. దీంతో ప్రసాద్ చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది. తన స్నేహితుడైన డొనోవాన్ మ్యాథ్యూ రివీరా సహాయంతో అతను మంగాక్కట్‌ను హత్య చేశాడని పోలీసులు తేల్చారు. ఈ నేరం రుజువైతే ప్రవాస భారతీయుడికి మరణశిక్ష పడే అవకాశం ఉందని న్యాయనిపుణులు చెపుతున్నారు.