Webdunia - Bharat's app for daily news and videos

Install App

లారెన్స్ తమ్ముడు పక్కలోకి రమ్మంటున్నాడు.. జూనియర్ దివ్య

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2020 (16:54 IST)
టాలీవుడ్ సినీ నటి శ్రీరెడ్డి పుణ్యమాని సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న లైంగిక వేధింపులు (కాస్టింగ్ కౌచ్) వెలుగులోకి వచ్చాయి. ఈమె ఎదుర్కొన్న అనుభవాలు, అవమానాలు, వేధింపులను మీడియా ముందు పూసగుచ్చినట్టు చెప్పుకొచ్చింది. అనేక స్టార్ హీరోలపై కూడా ఆమె సంచలన ఆరోపణలు చేసింది. ముఖ్యంగా, సినీ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నిర్మాత, హీరోగా రాణిస్తున్న రాఘవ లారెన్స్‌పై శ్రీరెడ్డి పబ్లిక్‌గానే ఆరోపణలు చేసింది. దీంతో అనేక హీరోలు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత అన్ని చిత్ర సీమల్లో తెరవెనుక జరుగుతున్న లైంగిక వేధింపులపై మీటూ ఉద్యమం పేరుతో వెలుగులోకి వచ్చాయి. 
 
ఈ నేపథ్యంలో దర్శకుడు లారెన్స్ రాఘవ తమ్ముడు వినోద్ (ఎల్విన్) తనను గత వేధిస్తున్నాడంటూ వరంగల్ జిల్లాకు చెందిన దివ్య అనే జూనియర్ ఆర్టిస్ట్ సంచలన ఆరోపణలు చేసింది. అతని ప్రేమను తాను తిరస్కరించడంతో వేధించడం మొదలు పెట్టాడని తెలిపింది. 
 
ఇదే అంశంపై ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, వినోద్ వేధింపులను తట్టుకోలేక హైదరాబాద్ వెస్ట్ మారేడ్‌పల్లి పోలీసులకు తాను ఫిర్యాదు చేశానని... అయితే సీఐతో కుమ్మక్కై వారు తనపై తప్పుడు కేసులు పెట్టారని వాపోయింది. ఇప్పుడు ఆ అధికారి ఏసీపీగా ఉన్నారని చెప్పింది. ఆ అధికారి లారెన్స్‌కు నమ్మినబంటులా మారిపోయారని తెలిపింది. వీరందరి చీకటికోణాలు తనకు తెలుసని చెప్పింది.
 
సదరు పోలీసు అధికారి అండతో వారు తనను జైలుకు పంపించారని దివ్య ఆవేదన వ్యక్తంచేసింది. కొన్ని రోజులుగా తనను కొందరు ఫాలో అవుతున్నారని... లారెన్స్ తమ్ముడితో తనకు ప్రాణభయం ఉందని, తనకు రక్షణ కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపింది. ఈమె ఆరోపణలతో మరోమారు కాస్టింగ్ కౌచ్ అంశంపై చర్చ జరిగే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

PV Sindhu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు, వెంకట సాయి.. (video)

Telangana: భర్తను చెల్లెలి సాయంతో హత్య చేసిన భార్య.. ఎందుకు ?

జనవరి 31 నుంచి అరకు ఉత్సవాలు.. మూడు రోజుల జరుగుతాయ్

తెలంగాణ భక్తులకు తిరుమలలో ప్రాధాన్యత ఇవ్వాలి: కొండా సురేఖ

కుమార్తె వచ్చాకే డాక్టర్ మన్మోహన్ అంత్యక్రియలు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

Herbal Tea హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

winter heart attack చలికాలంలో గుండెపోటుకి కారణాలు, అడ్డుకునే మార్గాలు

అరుదైన ఎక్స్‌ట్రాసోసియస్ ఆస్టియోసార్కోమాతో బాధపడుతున్న 18 ఏళ్ల బాలికకు ఏఓఐ విజయవంతంగా చికిత్స

Dry cough Home remedies పొడి దగ్గు తగ్గటానికి చిట్కాలు

తర్వాతి కథనం