Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్యాన్సీ నంబరు కోసం రూ.17 లక్షలు వెచ్చించిన టాలీవుడ్ హీరో

Webdunia
గురువారం, 23 సెప్టెంబరు 2021 (07:15 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన కొందరు హీరోలకు ఫ్యాన్సీ నంబర్లు అంటే అమితమైన మోజు. అలాంటి వారిలో హీరో జూనియర్ ఎన్టీఆర్ మొదటివరుసలో ఉంటారు. తాజాగా ఆయన ఓ ఫ్యాన్సీ నంబరు కోసం ఏకంగా రూ.17 లక్షలను ఖర్చు చేశారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్, ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ కార్యాలయంలో సెంట్రల్‌ జోన్‌ పరిధిలో కొత్త సిరీస్‌ నంబర్లకు బుధవారం వేలంపాట జరిగింది. పాత సిరీస్‌లోని చివరి నంబరైన టీఎస్09ఎఫ్ఎస్ 9999ను హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ కొనుగోలు చేశారు. బుధవారం జరిగిన వేలంపాటలో మొత్తం రూ.45.53 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు. 
 
సెంట్రల్‌ జోన్‌ పరిధిలో రిజిస్టర్‌ అయిన నంబర్లకు బుధవారం వేలం వేశారు. అత్యధికంగా టీఎస్09ఎఫ్ఎస్ 9999 నంబర్‌ను రూ.17 లక్షలకు జూనియర్‌ ఎన్టీఆర్‌ చేజిక్కించుకోగా టీఎస్‌09 ఎఫ్‌టీ 0001 నంబర్‌ను లహరి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.7.01 లక్షలు వెచ్చించి సొంతం చేసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

ప్రియుడితో మాట్లాడుతోందని అక్కను మట్టుబెట్టిన తమ్ముడు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments