Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనతా గ్యారేజ్ పోస్టర్లలో ఎన్టీఆర్ ఏడీ...? మోహన్ లాల్ హీరోగా ప్రచారం

తెలుగు సినిమా ఇండస్ట్రీ లోని హీరోలకు మలయాళంలోను మంచి క్రేజ్ ఉంది. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటించిన జనతా గ్యారేజ్ చిత్రం సెప్టెంబరు ఒకటో తేదీన విడుదలవుతున్న సంగతి విదితమే. కాగా ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న భారీ విజయం ‘జనతా గ్యారేజ్‌’తో వస్తుందని యంగ్‌ ట

Webdunia
శనివారం, 27 ఆగస్టు 2016 (14:08 IST)
తెలుగు సినిమా ఇండస్ట్రీ లోని హీరోలకు మలయాళంలోను మంచి క్రేజ్ ఉంది. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటించిన జనతా గ్యారేజ్ చిత్రం సెప్టెంబరు ఒకటో తేదీన విడుదలవుతున్న సంగతి విదితమే. కాగా ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న భారీ విజయం ‘జనతా గ్యారేజ్‌’తో వస్తుందని యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ చాలా నమ్మకంగా ఉన్నాడు. 
 
ఇటు తెలుగులోను, అటు మలయాళంలోనూ మార్కెట్‌ సృష్టించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఐతే తెలుగు మాటేమో కానీ, మలయాళంలో మాత్రం ఎన్టీఆర్‌ కలలు నెరవేరే సూచనలు కనబడటం లేదు. ఎందుకంటే జనతా గ్యారేజ్‌ను మలయాళంలో మోహన్‌లాల్‌ సినిమాగానే ప్రచారం చేస్తున్నారు. ఆ సినిమా పోస్టర్లలోనూ ఆయనే ప్రముఖంగా కనబడుతున్నాడు. 
 
మలయాళ వెర్షన్‌లో ఇప్పటివరకు ఎన్టీఆర్‌ను హైలెట్‌ చేయలేదు. ఈ సినిమా విడుదల తేదీని కన్ఫర్మ చేస్తూ కేరళలో వేసిన పోస్టర్‌లో అయితే ఎన్టీయార్‌ లేనే లేడు. కేవలం మోహన్‌లాల్‌ ఒక్కడే కనిపిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మలయాళంలో విడుదల చేస్తోంది, ప్రమోషన్‌ చేస్తోంది కూడా ఆయన సంస్థే. అయితే ప్రస్తుతానికి ఇదో వ్యూహంలా కనిపిస్తోంది. మరి ఈ సినిమా కేరళలో ఎన్టీఆర్‌కు ఎంత పేరు తీసుకువస్తుందో చూడాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కాదంబరి వ్యవహారం: వైఎస్సార్‌సీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ అరెస్టు

సింగరేణి కార్మికులకు రూ. 1.90లక్షల బోనస్‌.. దసరా కానుక

గణేష నిమజ్జనం- మహిళల పట్ల అలా ప్రవర్తించారు.. 999 మంది అరెస్ట్

సైబర్ నేరగాళ్ల పంజా.. సుప్రీం కోర్టు యూట్యూబ్ హ్యాక్!!

సంగారెడ్డిలో గంజాయి.. 30 గుంటల్లో సాగు చేశారు.. చివరికి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

మణిపాల్ హాస్పిటల్‌కు ఎన్ఏబీహెచ్ డిజిటల్ హెల్త్ అక్రిడిటేషన్-గోల్డ్ లెవెల్

అంజీర మిల్క్ తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments