Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాన్నకు చివరిగా స్పెషల్ పలావ్ పంపించా: జూనియర్ ఎన్టీఆర్

ఎన్టీఆర్ మాట్లాడుతూ.. నాన్న మరణానికి కొద్దిరోజుల క్రితం నాకు ఫోన్ చేశారు. పలావ్ కావాలని అడిగారు. నాన్న అడిగారని షూటింగ్ నుంచి ఇంటికి వెళ్ళగానే స్పెషల్‌గా పలావ్ చేసి నాన్నకు పంపించానన్నారు.

Webdunia
ఆదివారం, 7 అక్టోబరు 2018 (17:20 IST)
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం అరవింద సమేత సినిమా ప్రమోషన్‌లో వున్నారు. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌లో దివికేగిన తన తండ్రి, నటుడు, హరికృష్ణ గురించి తలచుకున్నారు. అభిమానుల మధ్య భావోద్వేగానికి గురయ్యారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన తండ్రి గురించిన ఆసక్తికర విషయాలు, అరవింద సినిమా విశేషాలు చెప్పుకొచ్చారు. తాను బాగా వంట చేస్తానని.. చివరిగా తన తండ్రికి భోజనం పంపించిన విషయం గురించి గుర్తుచేసుకున్నారు. 
 
ఇంకా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. నాన్న మరణానికి కొద్దిరోజుల క్రితం నాకు ఫోన్ చేశారు. పలావ్ కావాలని అడిగారు. నాన్న అడిగారని షూటింగ్ నుంచి ఇంటికి వెళ్ళగానే స్పెషల్‌గా పలావ్ చేసి నాన్నకు పంపించానన్నారు. చివరి సారిగా నాన్నగారికి అదే ఇచ్చాను అని భావోద్వేగానికి గురయ్యారు. అరవింద సమేత ఈ నెల 11న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. 
 
త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఆ సినిమాను రాధాకృష్ణ నిర్మించారు. ఈ సినిమా షూటింగ్‌లో దర్శకుడు త్రివిక్రమ్, సినీ యూనిట్ మొత్తం తనకు అండగా నిలబడ్డారని.. త్రివిక్రమ్ ఆత్మబంధువుగా మారిపోయారని జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మిథున్ రెడ్డికి షాకిచ్చిన సుప్రీంకోర్టు... సరెండర్‌కు కూడా నో టైమ్..

Hyderabad: పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు..

Hyderabad: స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25- ఆరవ పరిశుభ్రమైన నగరంగా హైదరాబాద్

ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో లాలూకు చిక్కులు.. కేసు విచారణ వేగవంతం చేయాలంటూ...

భార్యాపిల్లలను బావిలో తోసేశాడు... ఆపై గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments