ప్రముఖ దర్శకుడిపై జితేందర్ రెడ్డి హీరో రాకేష్ వర్రే ఫైర్

డీవీ
బుధవారం, 6 నవంబరు 2024 (14:37 IST)
Rakesh Varre
చిన్న సినిమాలకు ప్రమోషన్ చేయాలంటే కాస్త పేరున్న సెలబ్రిటీలు సపోర్ట్ గా నిలిస్తే ఊపిరి పోసుకున్నట్లుంటుంది. అసలు సినిమానే ఎందుకు తీశాం. ఈ రంగంలో ఎందుకు వచ్చామనే భాధ కలగకూడదు. సినిమా చేసి విడుదలచేయాలంటే సెలబ్రిటీలతో ఫంక్షన్ చేస్తున్నారా అంటూ అడుగుతున్నారు. కానీ ఏ సెలబ్రిటీ రావడానికి సుముఖంగా లేరు. ఏదో సాకుతో తప్పించుకుంటున్నారంటూ తన ఆవేదనను ఆక్రోషాన్ని నటుడు రాకేష్ వర్రే వ్యక్తం చేశారు.
 
గతంలో ఓ పెద్ద దర్శకుడితో 3 సంవత్సరాల జర్నీ చేశా. ఆ తర్వాత నేను పేకమేడలు సినిమా నిర్మించాను. ఆ సినిమాకు సెలబ్రిటీ కోసం ఆ దర్శకుడికి చెబితే ఇలాంటి ఫంక్షన్ కు రావడంలేదని చెప్పారు. మరి మొన్ననే ఓ ఫంక్షన్ కు వెళ్ళారుగదా మాది కూడా అలాగే సపోర్ట్ చేయండి అని వేడుకున్నాను. అది ఆబ్లిగేషన్ అన్నారు. మాది కూడా అలా చేయండిసార్ అని వేడుకున్నా. కానీ ససేమిరా అన్నాడు. అంటే సినిమా రంగంలో పేరు లేకపోతే ఎవ్వరూ ముందుకు రారా? అసలు సినిమారంగం కొత్తవారిని రానీయదా? అంటూ ఆవేశంగా మాట్లాడారు. రాకేష్ గతంలో బాహుబలిలో అనుష్కను అవమానించే సైనికుడి పాత్ర పోషించాడు.
 
తాజాగా ఆయన నటించిన సినిమా జితేందర్ రెడ్డి. అందులో కాలేజీ యూనియన్ లీడర్ గా నటించాడు. నగ్జలిజంపై పోరు తో సినిమా వుంటుంది. ఈ ఏడాది నుంచిఎన్నో సార్లు విడుదలతేదీను మార్చుకుంటూ సరైన సపోర్ట్ లేక ఆఖరికి ఈనెల 8న సినిమాను విడుదల చేస్తున్నట్లు రాకేష్ వెల్లించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీసులే దొంగలుగా మారితే.... దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకు....

గోవా నైట్ క్లబ్ ఫైర్ .. ఆ తప్పే ప్రాణాలు హరించాయా? మృతుల్లో 20 మంది స్టాఫ్

ఉడుపి క్షేత్రాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్ - ఈ పవిత్ర భూమిలో అడుగుపెట్టడం... (వీడియో)

గోవా నైట్ క్లబ్‌లో విషాదం - 25 మంది అగ్నికి ఆహుతి

ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్ధూ పేరును ప్రకటించాలి : నవజ్యోతి కౌర్ సిద్ధూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

తర్వాతి కథనం
Show comments