Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుగు భాష‌ల్లో జిన్నా టీజర్

Webdunia
శుక్రవారం, 19 ఆగస్టు 2022 (15:33 IST)
Vishnu Manchu
విష్ణు మంచు తాజా చిత్రం 'జిన్నా' టీజర్ ను ఆగస్ట్ 25న  విడుదల చేయడానికి రంగం సిద్ధమవుతోంది. తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ఈ టీజర్ విడుదలకానుంది. బాలీవుడ్ స్టార్ సన్నీలియోన్ ఈ చిత్రంలో ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తోంది. ఇటీవలే విడుదల చేసిన సన్నీలియోన్ ఫస్ట్ లుక్ పోస్టర్ కు సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. 
 
సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే కోన వెంకట్ అందించారు. ఈ చిత్రంలో హీరో విష్ణు మంచు స‌ర‌స‌న‌ సన్నీలియోన్, తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితురాలైన‌ మరో హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.
 
తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అవా ఎంటర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న'జిన్నా' పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో హీరో విష్ణుతో స‌న్నీ రీల్స్... విష్ణు, ఆయ‌న బృందంతో సన్నీ ఓ చమత్కారమైన రీల్స్ విడుద‌ల చేసి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ర్షించారు. '
 
నాటు నాటు' ఫేమ్ ప్రేమ్ రక్షిత్ మాస్ట‌ర్ ఈ చిత్రానికి డ్యాన్స్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. త‌న సంగీతంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ఉర్రుత‌లూగించే అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నారు. ఛోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments