Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో డాక్టర్ రాజశేఖర్ ఆరోగ్యం ఎలావుంది?

Webdunia
బుధవారం, 4 నవంబరు 2020 (10:24 IST)
సినీ హీరో డాక్టర్ రాజశేఖర్ ఆరోగ్యంపై పలురకాలైన వదంతులు వస్తున్నాయి. దీనికి కారణం ఆయన కరోనా వైరస్ బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ముఖ్యంగా, హైదరాబాద్‌లోని సిటీ న్యూరో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో చేరిన తొలి రోజు నుంచే ఆయనను ఐసీయూ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. పైగా, ఆయన వెంటిలేటర్ మీద ఉన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. 
 
ఈ నేపథ్యంలో తన భర్త ఆరోగ్యంపై నటి జీవితా రాజశేఖర్ స్పందించారు. 'రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి బాగా మెరుగుపడింది. త్వరగా కోలుకుంటున్నారు. సిటీ న్యూరో సెంటర్ వైద్యులు చాలా కేరింగ్ తీసుకున్నారు. అందువల్ల రాజశేఖర్ విషమ పరిస్థితి నుంచి బయటపడ్డారు. త్వరలోనే ఐసీయూ నుంచి కూడా బయటకు వచ్చేస్తారు. 
 
రాజేశేఖర్ వెంటిలేటర్ మీద ఉన్నారని ఓ వార్త ప్రచారం అవుతోంది. అది నిజం కాదు. ఆయన ఎప్పుడూ వెంటిలేటర్ మీద లేరు. నిజానికి ఆయన ఆరోగ్యం తీవ్రంగా విషమించింది. అయితే వెంటిలేటర్ మీద మాత్రం లేరు. నాన్ ఇన్‌వాసివ్ వెంటిలేటర్ సాయంతో ఆక్సిజన్ అందించారు. ఇప్పుడు మెల్లిమెల్లిగా ఆక్సిజన్ సపోర్ట్ తగ్గిస్తూ చికిత్స చేస్తున్నారు. స్నేహితులు, శ్రేయోభిలాషులు, సహనటులు, అభిమానులు చేసిన ప్రార్థనలు కారణంగానే రాజశేఖర్ క్షేమంగా ఉన్నారు అని జీవితా రాజశేఖర్ చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

యూజీ నీట్ ప్రవేశ పరీక్షా విధానంలో కీలక మార్పు?

మహా పీఠముడి... మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అరెస్టుకు సిద్ధంగా పోలీసులు.. పారిపోయిన రాంగోపాల్ వర్మ!!

బంగాళాఖాతంలో అల్పపీడనం : ఏపీతో సహా ఆ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments