Webdunia - Bharat's app for daily news and videos

Install App

'గులాబీ' కోసం ఇల్లు అమ్మేద్దామనుకున్నాను: జేడీ

Webdunia
బుధవారం, 26 జూన్ 2019 (12:35 IST)
'గులాబీ'... కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా హీరో జేడీ చక్రవర్తి కెరీర్‌ని ఏ విధంగా మలుపు తిప్పిందో అందరికీ తెలిసిన విషయమే. అయితే తాజాగా ఈటీవీ కార్యక్రమం 'ఆలీతో సరదాగా'లో పాల్గొన్న జేడీ చక్రవర్తి మాట్లాడుతూ ఈ సినిమాను గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. 
 
ఈ మేరకు జేడీ మాట్లాడుతూ... 'గులాబీ' కథను కృష్ణవంశీ గారు చెప్పినప్పుడు నాకు విపరీతంగా నచ్చేసింది. ఈ కథను తీసుకుని నిర్మాత దువ్వాసి మోహన్ దగ్గరికి వెళితే, కథంతా వినేసి 'హీరో రాజశేఖర్‌తో చేస్తే ఎలా ఉంటుంది?' అన్నాడు. అప్పటికి దువ్వాసి మోహన్ ఇంకా యాక్టర్ కాలేదు. దాని తర్వాత ఆ కథని తీసుకుని చాలా మంది నిర్మాతల దగ్గరికి వెళ్లాను. 
 
కానీ నాతో సినిమా చేయడానికి వాళ్లెవరూ ముందుకురాలేదు. దాంతో ఇక ఇల్లు అమ్మేద్దామని నిర్ణయించుకుని, ప్రయత్నాలు మొదలెట్టాను. ఈ విషయం వర్మగారికి తెలిసి నాకు చీవాట్లు పెట్టారు. ఇల్లు అమ్మొద్దనీ .. అమితాబ్‌తో కలిసి తానే ఈ సినిమాను నిర్మిస్తానంటూ ముందుకొచ్చారు" అని చెప్పుకొచ్చారు.
 
మరి అంత కమిట్‌మెంట్ ఉండబట్టే సినిమా అంత బాగా వచ్చిందేమో...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments