Webdunia - Bharat's app for daily news and videos

Install App

రౌడీగారి తమ్ముడు.. కాస్త స్టైల్ మార్చక తప్పదు!

Webdunia
బుధవారం, 26 జూన్ 2019 (12:32 IST)
టాలీవుడ్‌లో ఒక్కసారిగా సెన్సేషనల్ అయిపోయి ఆ తర్వాత వరుసగా ఎడాపెడా సినిమాలు చేసేస్తున్న హీరో విజయ్ దేవరకొండ. కాగా... ఆయన తమ్ముడు ఆనంద్ దేవరకొండ 'దొరసాని' చిత్రంతో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఈ సినిమాతో డా.రాజశేఖర్- జీవితల కుమార్తె శివాత్మిక హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. ఈ సినిమా జులై 12న విడుదలకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో... 'దొరసాని' టీమ్ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ బిజీగా ఉన్నారు. ఇందులోభాగంగా సినిమాకి సంబంధించిన లిరికల్ సింగిల్స్ రిలీజ్ చేస్తూ సినిమాపై బజ్ పెంచే ప్రయత్నం కూడా చేస్తున్నారు.
 
అయితే రీసెంట్‌గా ఈ సినిమాకి సంబంధించిన ఒక లిరికల్ సాంగ్‌ని రిలీజ్ చేసేందుకు హీరో ఆనంద్ దేవరకొండ - హీరోయిన్ శివాత్మికలు ఒక ఎఫ్ ఎం స్టేషన్‌లో సందడి చేసారు. సోషల్ మీడియాలో కూడా ఈ ఫోటోలు వైరల్ కాగా... ఈ ఫోటోలలో ఆనంద్ లుక్స్.. బాడీ లాంగ్వేజ్‌కు నెగెటివ్ రెస్పాన్స్ వస్తోంది. 
 
'దొరసాని' సినిమాలో పాత్ర ప్రకారం ఒక పేదింటి అబ్బాయి లాగా కనపడడం వరకూ సరే కానీ మరీ ప్రమోషన్స్‌లో కూడా ఆనంద్ లుక్స్ ఈ జెనరేషన్‌కు తగ్గట్టుగా లేవనే కామెంట్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి. కొంతమంది విజయ్ అభిమానులు కూడా ఆనంద్ తన స్టైల్ మీద.. మేకోవర్ మీద ఫోకస్ చెయ్యాలని.. ఈ విషయాలలో అన్నగారి సలహాలు.. సూచనలు పాటించాలని చెప్తూండటం ఇక్కడ కొసమెరుపు. 
 
నిజానికి విజయ్ దేవరకొండను యూత్‌కి చేరువ చేసిన అంశాలలో స్టైలింగ్ ఒకటి. మరి ఆ అన్నయ్య తమ్ముడు ఆయన దగ్గర ఈ విషయాల్లో సలహాలు తీసుకుంటున్నాడో లేదో..! 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

పెద్దిరెడ్డి పక్కకుపోతే.. పవన్‌తో చేతులు కలిపిన బొత్స -వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

తర్వాతి కథనం
Show comments