Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా ఫ్రెండ్‌దేమో పెళ్లి తెలంగాణ జాన‌ప‌ద గీతంలో అలరించిన జ‌యతి

Webdunia
బుధవారం, 17 మే 2023 (16:38 IST)
Jayati
భీమ్స్ సిసిరోలియో సంగీత సార‌థ్యంలో కాస‌ర్ల శ్యామ్‌, శ్రావ‌ణ భార్గ‌వి  కాంబోలో ఆక‌ట్టుకుంటోన్న తెలంగాణ జాన‌ప‌ద గీతం నేడు విడుదలైంది. గ‌డిచిన రెండేళ్ల‌లో తెలుగు, హిందీ, త‌మిళ్‌, క‌న్న‌డ భాష‌ల్లో నివృతి సంస్థ 50కి పైగా మ్యూజిక్ వీడియో సాంగ్స్‌ను అందించింది. వీటిలో జ‌రీ జ‌రీ పంచెక‌ట్టి.., గుంగులు, సిల‌క ముక్కుదానా, జంజీరే, వ‌ద్ద‌న్నా గుండెల్లో సేరి వంటి పాట‌లు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకున్నాయి.
 
ఇప్పుడు నివృతి వైబ్స్ నుంచి మ‌రో తెలంగాణ జాన‌ప‌ద పాట మ్యూజిక్ వీడియోగా మ‌న ముందుకు వ‌చ్చింది. ‘నా ఫ్రెండ్‌దేమో పెళ్లి..’ అంటూ సాగే ఈ పాటలో జయతి ప్రధాన భూమికను పోషించింది. బుల్లి తెరపై వెన్నెల ప్రోగ్రామ్‌తో తిరుగులేని క్రేజ్‌, ఇమేజ్‌ను ద‌క్కించుకున్న జ‌య‌తి ఈ సాంగ్‌లో అద్భుత‌మైన హావ భావాల‌తో, మూమెంట్స్‌లో క‌ట్టి ప‌డేసింది. ఈ మ‌ధ్య కాలంలో విడుద‌లైన సెన్సేష‌న‌ల్ పాట‌ల‌కు సంగీతాన్ని అందిస్తోన్న మ్యూజిక్ డైరెక్ట‌ర్ భీమ్స్ సిసిరోలియో ‘నా ఫ్రెండ్‌దేమో పెళ్లి...’ సాంగ్ కు సంగీత సారథ్యాన్ని అందించారు. శ్రావణ భార్గవి అద్భుతంగా పాడిన ఈ పాటకు ప్రాణం పోశారు. భాను మాస్ట‌ర్ సాంగ్కి సూప‌ర్బ్‌గా కొరియోగ్ర‌ఫీ చేశారు.లిరిసిస్ట్‌ కాసర్ల శ్యామ్ మరోసారి తన పెన్ పవర్ ఎలా ఉంటుందో చూపించారు. జ‌య‌తి విజ‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీకోనేటి ఈ పాట‌ను డైరెక్ట్ చేశారు.
 
యంగ్ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తూ డిజిట‌ల్ మాధ్య‌మంలో ఒక బిలియ‌న్ వ్యూస్ ఉన్న ఫ్లాట్‌ఫామ్స్ నివృతి వైబ్స్ సొంతం. శేఖ‌ర్ మాస్ట‌ర్‌, సుద్దాల అశోక్ తేజ, భీమ్స్ సిసిరోలియో, షణ్ముఖ్ జశ్వంత్, మధు ప్రియ, శ్రావణ భార్గవి, దేత్తడి హారిక, లహరి షారి, మానస్, విష్ణు ప్రియ, అనన్య భట్, రాజ్యలక్ష్మి, హారిక నారాయ‌ణ్‌, సాకేత్ కొమందూరి వంటి టాలెంటెడ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌తో నివృతి వైబ్స్ వ‌ర్క్ చేసింది.
 
2024 పూర్త‌య్యేస‌రికి 150 పైచిలుకు మ్యూజిక్ వీడియో సాంగ్స్‌ను అందించ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నట్లు నివృతి వైబ్స్ సంస్థ తెలియ‌జేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో ఒక రోజు ముందుగానే సామాజిక పింఛన్ల పంపిణీ.. నేమకల్లుకు సీఎం బాబు

ఆంధ్ర నుంచి ఆఫ్రికాకు రేషన్ బియ్యం, కాకినాడ పోర్టు స్మగ్లింగ్ కేంద్రంగా మారిందా?

రేవంత్ రెడ్డి "ఏఐ సిటీ"కి శంకుస్థాపన ఎప్పుడో తెలుసా?

హైదరాబాద్‌- 50వేల కేసులు, రూ.10.69 కోట్ల ఫైన్.. 215మంది మృతి

12 అడుగుల భారీ గిరినాగు.. రక్తపింజరను మింగేసింది.. ఎలా పట్టుకున్నారంటే? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments