Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం సినిమా తరువాత ఒక విషయం అర్థమైంది : మణిశర్మ

Praveen kandela,Jaideep Vishnu,Manisharma,Jaiyetri Makana,Shrikant Rathod, kasarla Shyam, Santosh Murarikar
, సోమవారం, 30 జనవరి 2023 (17:22 IST)
Praveen kandela,Jaideep Vishnu,Manisharma,Jaiyetri Makana,Shrikant Rathod, kasarla Shyam, Santosh Murarikar
ప్రవీణ్‌ కండెలా, శ్రీకాంత్ రాథోడ్, జయెత్రి మకానా, శివరామ్ రెడ్డి ఇలా నలభై మంది కొత్త నటీనటులతో రాబోతోన్న చిత్రం రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం. వారధి క్రియేషన్స్ ప్రై.లి. బ్యానర్ మీద ఈ సినిమాను జైదీప్ విష్ణు దర్శకుడిగా తెరకెక్కిస్తున్నాడు. సంతోష్ మురారికర్ కథ అందించడమే కాకుండా కో డైరెక్టర్‌గానూ పని చేసిన ఈ చిత్రం ఫిబ్రవరి 3న రాబోతోంది. ఈ క్రమంలో ఆదివారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
 
డైరెక్టర్ జైదీప్ విష్ణు మాట్లాడుతూ, మా ఊరోడు సినిమా తీస్తున్నాడని, మాకు ఊరు ఊరంతా సాయం చేసింది. తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాకు ఎంతో సాయం చేసింది. నా ఇద్దరు హీరోలు, హీరోయిన్లకు థాంక్స్. ఈ సినిమాకు మ్యూజిక్ విషయంలో ఇబ్బంది పడ్డాం. మణిశర్మ గారి వద్దకు వెళ్లాక ఆ సమస్య తీరిపోయింది. నాలుగు పాటలు నాలుగు రోజుల్లోనే ఇచ్చారు. లిరిక్స్ ఇచ్చిన వెంటనే పాటలు వచ్చేశాయి. కాసర్ల శ్యామ్‌ లేకపోతే మాకు మణిశర్మ గారు దొరికేవారు కాదు. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. నా ఇద్దరు హీరోలు వారి వారి శైలిలో ఆకట్టుకుంటారు. హీరోయిన్ పాత్రను రాసినప్పుడే తెలంగాణ అమ్మాయినే తీసుకోవాలని అనుకున్నాం. తెలంగాణ యాసలో మాట్లాడే అమ్మాయి అయితేనే బాగుంటుందని జయెత్రిని తీసుకున్నాం. మాకు ఇంత వరకు సపోర్ట్ చేస్తూ వచ్చిన మీడియాకు థాంక్స్. మా సినిమా ఫిబ్రవరి 2న యూఎస్‌లో విడుదలవుతోంది. ఫిబ్రవరి 3న రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలవుతోంది. థియేటర్లో ఈ సినిమాను చూడండి' అని అన్నారు.
 
మెలోడి బ్రహ్మ మణిశర్మ మాట్లాడుతూ.. 'ఈ సినిమా అంతా అయిపోయిన తరువాత నాకు ఒక విషయం అర్థమైంది. దర్శకుడు కనిపించినంత సాఫ్ట్ ఏం కాదు. మేం అంతా కలిసి కొత్తగా ట్రై చేశాం. ఆడియెన్స్ సినిమాను చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.
 
ప్రవీణ్ కండేలా మాట్లాడుతూ.. 'ఈ చిత్రంలో రాజన్న పాత్రను పోషించాను. మేం ఇంతకు ముందు చోర్ బజార్ అనే షార్ట్ ఫిల్మ్‌ చేశాం. ఆ తరువాత ఇండిపెండెంట్‌ సినిమా చేద్దాం అనుకున్నాం. అది చివరకు పెద్ద సినిమాగా మారింది. విలన్‌గా చేశానా? లీడ్‌గా చేశానా? అన్నది సినిమా చూశాకే అర్థం అవుతుంది.  సినిమా అయిపోయాక ఏడ్చుకుంటూ వస్తారు' అని అన్నారు.
 
శ్రీకాంత్ రాథోడ్, గౌతమ్, జయెత్రి, కెమెరామెన్ శ్రీకాంత్ అరుపుల, రైటర్ సంతోష్, కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ..ఈ సినిమాను పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నాను' అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హన్సిక వన్ నాట్ ఫైవ్ మినిట్స్ ట్రైలర్ రాబోతుంది