Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విజువల్ వండర్‌గా శాకుంతలం నుంచి మల్లికా మల్లికా సాంగ్

mallika song samantha
, బుధవారం, 18 జనవరి 2023 (19:37 IST)
mallika song samantha
మ‌ల్లికా మ‌ల్లికా మాల‌తీ మాలికా
చూడ‌వా చూడ‌వా ఏడి నా ఏలిక‌
హంసికా హంసికా జాగునే సేయ‌కా
పోయిరా పోయిరా .. రాజుతో రా ఇకా..
 
ఈ పాట వింటుంటే మ‌న‌సులో తెలియ‌ని ఓ ఉద్వేగం, తీయ‌ని అనుభూతి క‌లుగుతుంది. త‌న భ‌ర్త దుష్యంతుడి కోసం ఎదురు చూసే శకుంత‌ల త‌న చుట్టూ ఉన్న మొక్క‌లు, ప‌క్షులతో మ‌న‌సులోని బాధను అందంగా వ్య‌క్తం చేస్తుంది. మ‌రి పూర్తి స్థాయి విజువ‌ల్స్‌తో సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఈ పాట‌ను వీక్షించాలంటే మాత్రం  ఫిబ్ర‌వ‌రి 17 వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందేనంటున్నారు ఎపిక్ ఫిల్మ్ మేక‌ర్ గుణ శేఖ‌ర్‌. ప్రతీ సినిమాను ఎంతో ప్యాషన్‌తో తెర‌కెక్కిస్తూ ప్ర‌తీ ఫ్రేమ్ చాలా గొప్ప‌గా ఉండాల‌ని క‌ల‌లు క‌ని దాన్ని వెండితెర‌పై  సృష్టించ‌టానికి ఆరాట‌ప‌డే అతి కొద్ది మంది ఫిల్మ్ మేక‌ర్స్‌లో గుణ శేఖ‌ర్ ఒక‌రు. ప్ర‌స్తుతం ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న పౌరాణిక‌ దృశ్య కావ్యం శాకుంతలం’.
 
మ‌హాక‌వి కాళిదాసు ర‌చించిన సంస్కృత‌ నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా చేసుకుని.. ‘శాకుతలం’ చిత్రాన్ని ఓ విజువ‌ల్ వండ‌ర్‌గా ఆవిష్క‌రిస్తున్నారు గుణ శేఖ‌ర్‌. ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియ‌న్ సినీ ల‌వ‌ర్స్ చూడ‌ని అందాల‌ను సిల్వ‌ర్ స్క్రీన్‌పై వావ్ అనిపించేలా అద్భుత‌మైన దృశ్య‌కావ్యంగా శాకుంతం సినిమా రానుంది. 
 
శ‌కుంత‌ల పాత్ర‌లో స‌మంత న‌టిస్తోన్న శాకుంత‌లం చిత్రంలో దుష్యంత మ‌హారాజు పాత్ర‌లో దేవ్ మోహ‌న్ న‌టించారు. సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంటుంది. ఫిబ్ర‌వ‌రి 17న ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాషల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌ల చేస్తున్నారు. సినిమా ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలు జోరుగా జ‌రుగుతున్నాయి. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఈ మూవీ ట్రైల‌ర్ అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. బుధ‌వారం ఈ సినిమా నుంచి ‘మ‌ల్లికా మ‌ల్లికా..’ పాటను మేకర్స్ విడుదల చేశారు. 
 
మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీత సారథ్యం వహించిన ఈ  చిత్రంలోని ఈ పాటను చైతన్య ప్రసాద్ రాయగా.. రమ్య బెహ్రా ఆలపించారు. 
 
 ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు స‌మర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్, గుణ టీమ్ వ‌ర్క్స్ ప‌తాకాల‌పై నీలిమ గుణ నిర్మాత‌గా శాకుంత‌లం సినిమా రూపొందుతోంది.గుణ శేఖ‌ర్ ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న శాకుంత‌లం చిత్రానికి సాయి మాధ‌వ్ బుర్రా సంభాష‌ణ‌లు అందించారు. శేఖ‌ర్ వి.జోసెఫ్ సినిమాటోగ్ర‌ఫీ చేసిన ఈ చిత్రానికి ప్ర‌వీణ్ పూడి ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. మెలోడీ బ్ర‌హ్మ మ‌ణి శ‌ర్మ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రాన్ని విజువ‌ల్‌గానే కాకుండా మ్యూజికల్‌గానూ ఆడియెన్స్‌కు ఆమేజింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వ‌టానికి రీ రికార్డింగ్‌ను బుడాపెస్ట్‌, హంగేరిలోని సింఫ‌నీ టెక్నీషియ‌న్స్ చేయ‌టం విశేషం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాప్ కార్న్ నుంచి సాంగ్ రిలీజ్ చేసిన నాగ చైతన్య