Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హన్సిక వన్ నాట్ ఫైవ్ మినిట్స్ ట్రైలర్ రాబోతుంది

Advertiesment
Hansika
, సోమవారం, 30 జనవరి 2023 (17:03 IST)
Hansika
హన్సిక ఒకే పాత్ర పోషించగా రాజు దుస్సా రచన దర్శకత్వంలో ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ గా రుద్రాన్ష్ సెల్యూలాయిడ్స్ పతాకం పై బొమ్మక్ శివ నిర్మిస్తున్న చిత్రం 'వన్ నాట్ ఫైవ్ మినిట్స్'. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీ రెడీ అయిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకి రానుంది. అతి త్వరలో ట్రైలర్ విడుదల కానుంది. వరల్డ్ ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే తొలి ప్రయత్నంగా సింగిల్ షాట్ లో సింగిల్ క్యారెక్టర్ తో రూపొందింది. 
 
ఒక గంటా నలభై అయిదు నిముషాల పాటూ సాగే ఒక ఉత్కంఠ రేపే కథను సింగిల్ షాట్ లో అంతే ఎంగేజింగ్ గా తెరకెక్కించడం సాహసమే. హాలీవుడ్ లో సింగిల్ షాట్ టెక్నిక్ లో తెరకెక్కిన బర్డ్ మన్, 1917 చిత్రాల తరహాలో 'వన్ నాట్ ఫైవ్ మినిట్స్' చిత్రం రూపొందించబడింది. ఆ చిత్రాలు సింగిల్ షాట్ తో తీసినా చాలా క్యారక్టర్ల చుట్టూ కథ నడుస్తుంది. కానీ 'వన్ నాట్ ఫైవ్ మినిట్స్' ఒకే పాత్రతో రన్ అయ్యే సినిమా.  ఇంకా రీల్ టైం, రియల్ టైం ఒకేలా ఉండి మనం ఆ సన్నివేశంలో ప్రత్యక్షంగా ఉన్నట్లు అనుభూతి చెందుతాం. డైలాగులు కూడా చాలా తక్కువగా అవసరమైనంత వరకే పరిమితమై గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తోనే సినిమా జరుగుతుంది. ఈ వినూత్న ప్రయోగాన్ని భారతదేశం లోనే తొలిసారిగా తెలుగు లో చేయడం గొప్ప విషయం. ఈ చిత్రానికి ఎక్కడా గ్రీన్ మ్యాట్ వాడకుండా లైవ్ గా షూట్ చేసి సి జీ వర్క్ యాడ్ చేయడం ప్రత్యేక ఆకర్షణ. ఇది డైరెక్టర్ విజన్ కు డి ఓ పి ప్రతిభకు తార్కాణం. ఫస్ట్ కాపీ రెడీ అయిన ఈ సినిమా అనుకున్నదానికంటే చాలా బాగా వచ్చిందని చిత్రం బృందం కాన్ఫిడెంట్ గా ఉన్నారు. టెక్నికల్ గా సింగిల్ షాట్ లో సింగిల్ క్యారక్టర్ తో చేసిన ఈ మూవీ ఒక బెంచ్ మార్క్ గా నిలిచిపోతుంది.
 
 ప్రతి సెకండ్ కథతో లింక్ అయ్యి ముందుకు నడిపిస్తుంది. అంత పర్జెక్ట్ స్క్రీన్ ప్లే తో సినిమా తీశారు రాజు దుస్సా. అందరూ ఇన్వాల్వ్ అయ్యి డెడికేటెడ్ గా చేయడంతో చిత్రం చాలా బాగా వచ్చింది. దేశంలోనే తొలిసారిగా సింగిల్ షాట్ సింగిల్ క్యారక్టర్ తో అతి తక్కువ డైలాగులతో తెరకెక్కిన 'వన్ నాట్ ఫైవ్ మినిట్స్' చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చిన నిర్మాత బొమ్మక్ శివ గట్స్ ను మెచ్చుకోకుండా ఉండలేం. ఆయనకి ఉన్న ప్యాషన్ వల్ల చిత్రం ఔట్ పుట్ లావిష్ ప్రొడక్షన్ వాల్యూస్ తో తెరకెక్కింది. చిత్ర బృందం త్వరలోనే ట్రైలర్ విడుదల చేయనున్నారు. సినిమా కూడా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఘనంగా ప్రారంభమైన పవన్ కళ్యాణ్, సుజిత్ చిత్రం